పల్లెలను పరిశుభ్రంగా మారుద్దాం | - | Sakshi
Sakshi News home page

పల్లెలను పరిశుభ్రంగా మారుద్దాం

Mar 7 2026 9:38 AM | Updated on Mar 7 2026 9:38 AM

బొమ్మలరామారం : పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి, మైసిరెడ్డి పల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని పర్యటించారు. పరిశుభ్రత కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కాలువతో పాటు రోడ్లు, వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్‌ పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాన్నారు. మైసిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అనంతరం మల్యాలలోని కేజీబీవీని తనిఖీ చేశారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ, కిచెన్‌, స్టోర్‌రూమ్‌, డార్మెంటరీని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, హౌసింగ్‌ పీడీ శ్రీరాములు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ గడ్డం జ్ఞానప్రకాష్‌ రెడ్డి, ఎంపీఓ శ్రీమాలిని, ఏపీఓ శ్రీలక్ష్మి, ఎంఈఓ రోజారాణి తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement