యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

ఉత్సవమూర్తులకు పుష్పార్చన చేస్తున్న అర్చకుడు - Sakshi

యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, ఆలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవంతో పాటు శ్రీస్వామి, అమ్మవారి సేవలను ఊరేగించారు. అదే విధంగా ఆండాళ్‌దేవికి ఊంజలి సేవోత్సవం వైభవంగా నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement