ఫ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చౌటుప్పల్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సక్రమంగా కరెంటు ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ద్వజమెత్తారు. రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. చౌటుప్పల్ పట్టణ పరిధిలోని తంగడపల్లి రోడ్డులోగల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడారు. ఓవైపు వర్షాభావం, మరోవైపు విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు దాపురించాయన్నారు. వ్యవసాయానికి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, లేనిపక్షంలో సబ్‌స్టేషన్లను ఎక్కడకక్కడ ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా లాగ్ బుక్ చూపించాలని డీఈని కోరగా ..సరఫరా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తామని చెప్పి పంపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్, నారాయణపురం మండల పార్టీ అధ్యక్షుడు నర్రి నర్సింహ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


