యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష పుష్పార్చనను అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సుగ్రంధ పరిమళాలు వెదజల్లె రంగురంగుల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. తులసీ దళాలతో శ్రీస్వామి అమ్మవార్లను విశేషంగా పూజించారు. ఇక ఆలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య పూజలు జరిపించారు. ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం కావడంతో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement