భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు అత్యంత బాధ్యతతో క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, ఇన్‌చార్జి డీఆర్వో పి.ప్రభాకర్, డ్వామా పీడీ సీహెచ్ అప్పారావు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు అర్జీలు స్వీకరించారు.
మా ఇంటిని లాక్కున్నారు
వేల్పూరుకు చెందిన 13 ఏళ్ల జక్కంశెట్టి చందు సాయిదుర్గారెడ్డి వృద్ధారాలైన తల్లి వరలక్ష్మితో కలిసి పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. తమ ఇంటిని కొందరు అన్యాయంగా లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం చందు విలేకరులతో మాట్లాడుతూ వేల్పూరులో తమకు చెందిన రెండు పోర్షన్ ఇంటిని ముగ్గురు వ్యక్తులకు అద్దెకు ఇచ్చామని, పదేళ్లుగా వారు ఉంటున్నారన్నారు. అయితే ఏడాదిగా అద్దె ఇవ్వకపోవడంతో పాటు తన తల్లి వరలక్ష్మి ఫోర్జరీ సంతకాలతో తాము ఇంటిని వారికి విక్రయించినట్టు పత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. గతంలో పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసినా న్యాయం జరగకపోవడంతో మరోమారు అర్జీ అందించామన్నారు. కొందరు నా యకులు ఇల్లు స్వాధీనం చేసుకున్నవారి వెనుక ఉండి తమను ఇబ్బంది పెడుతున్నారని, ఇంటిని తమకు అప్పగించడంతో పాటు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అర్జీల్లో కోరారు.
కలెక్టర్ నాగరాణి


