ఉద్యోగి భద్రతకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగి భద్రతకు ప్రాధాన్యమివ్వాలి

Aug 25 2026 1:39 AM | Updated on Aug 25 2026 1:39 AM

తాడేపల్లిగూడెం: ప్రతి ఉద్యోగి గౌరవానికి, భద్రతకు ఆయా సంస్థలు ప్రా ధాన్యత ఇవ్వాలని న్యా యవాది బిస్నా చంద్రన్‌ తెలిపారు. ఏపీ నిట్‌లో సోమవారం ఉమెన్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో లైంగిక వేఽధింపుల నిరోధక చట్టంపై బోధన, బోధనేతర సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ కార్యాలయాల్లో లైంగిక వేధింపులు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యకరమైన పని వాతావరణానికి విఘాతం కలిగిస్తాయన్నారు. మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే వేధింపులకు మౌనంగా ఉండకుండా చట్టపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించుకోవాలన్నారు. లైంగిక వేధింపుల నిరోధక చట్ట ప్రకారం కార్యాలయాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం యాజమాన్యాల బాధ్యత అన్నారు. వేధింపుల స్వభావం, ఫిర్యాదు చేసే విధానం గురించి వివరించారు. ఫిర్యాదు దారుల గోప్యతను కాపాడుతూ నిబంధ నల ప్రకారం చర్యలు తీసుకొనే వ్యవస్థలు ఉన్నాయన్నారు. సమన్వయకర్తగా ఆచార్యులు ప్రత్యూష జయంతి, రిజిస్ట్రార్‌ దినేష్‌ శంకరరెడ్డి పాల్గొన్నారు.

న్యాయవాది బిస్నా చంద్రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement