ఉండిలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ విశాఖలో లభించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 8లో u
రాయితీ విద్యుత్ హామీపై రెండేళ్లుగా నోరుమెదపని చంద్రబాబు ప్రభుత్వం జగన్ పర్యటన దెబ్బకు దిగొచ్చింది. వేలాదిగా తరలివచ్చిన రైతులను చూసి ఆఘమేఘాలపై జీఓను తెచ్చింది. అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్ ఎప్పుడూ రైతుల పక్షపాతే. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్సడాను ఏర్పాటుచేసి అండగా నిలిచారు. కరోనా సమయంలోనూ ఆదుకున్నారు.
– వడ్డి రఘురాంనాయుడు, వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్, అప్సడా మాజీ వైస్ చైర్మన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరంలో రొయ్యల రైతులకు అండగా నిలబడటానికి సదస్సు నిర్వ హించారు. ప్రభుత్వం దిగి వచ్చి రూ.1.50కే యూనిట్ విద్యుత్ జీఓను విడుదల చేసింది. రొయ్యల ధరలు కూడా పెరుగుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి రొయ్యల రైతుల పక్షాన పోరాడటంతోనే ప్రభుత్వం దిగి వచ్చింది.
– కావలి దామోదరరావు,
నందమూరి గరువు, ఆక్వా రైతు


