స్వరాజ్య బాట.. సంక్షేమ బావుటా | - | Sakshi
Sakshi News home page

స్వరాజ్య బాట.. సంక్షేమ బావుటా

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

చక్కదిద్దబడి చదువుల గుడి.. డిజిటల్‌ సవ్వడి అన్నదాతలకు అండగా..

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమ వైభవం
మహాత్ముని బాటలో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ వ్యవస్థలతో పాలనను పల్లెకు తెచ్చింది. సంక్షేమ ఫలాలు, వైద్యసేవలను చెంతకు చేర్చింది. నాడు–నేడుతో ప్రభుత్వ బడులకు జీవం పోసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ జగన్‌ సర్కారు సాధించిన గ్రామ స్వరాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి, భీమవరం

శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లలు 1,320 వరకు ఉన్నాయి. 2019 నాటికి శిథిల భవనాలు, పెచ్చులు ఊడే పైకప్పులు, రాళ్లు పైకిలేచిన ఫ్లోరింగులు, కలుషిత తాగునీరు, దుర్గంధం వెదజల్లే టాయిలెట్లతో అధ్వాన స్థితికి చేరిన ప్రభుత్వ బడులకు జగన్‌ కొత్త ఊపిరిలూదారు. 1,150 పాఠశాలల్లో రూ.369.11 కోట్లు వ్యయంతో డిజిటల్‌ క్లాస్‌రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్‌, కిచెన్‌షెడ్లు, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్‌, మైనర్‌ మరమ్మతులతో కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు.

పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టి ఐదేళ్లలో 1,48,342 మంది తల్లుల ఖాతాలకు రూ. 887.9 కోట్లు జమచేశారు.

పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేందుకు తరగతి గదుల్లో డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐపీపీ), స్మార్ట్‌ టీవీలు అందజేశారు. 28,143 మంది 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన రూ.30 వేల విలువైన ట్యాబ్‌లు అందజేశారు. ఆకర్షణీయ మెనూతో రోజుకో కొత్త రుచిని అందిస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ఉన్నత విద్యకు ఊతమిచ్చారు. ఇలా ఐదేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం కింద 1,77,996 మంది విద్యార్థులకు రూ.485.33 కోట్ల సాయం అందించగా వసతి దీవెన పథకం కింద 1,76,142 మంది విద్యార్థులకు రూ.163.41 కోట్లు అందించారు.

అన్నదాతల అవస్థలకు చెక్‌ పెడుతూ ఆర్‌బీకేల ద్వారా సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి పంట ఉత్పత్తులు విక్రయం వరకు ఇవి అన్నదాతలకు అడుగడుడునా అండయ్యాయి. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా పరిహారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో రూ.65 కోట్ల వ్యయంతో 298 భవన నిర్మాణాలు చేపట్టి 211 భవనాలు వినియోగంలో తెచ్చారు.

రూ.65 కోట్లు.. 298 ఆర్‌బీకే భవనాలు

28,143 మందికి ట్యాబ్‌లు.. సుమారు 3.54 లక్షల మందికి ‘దీవెనలు’

రూ.369 కోట్లు.. 1,150 పాఠశాలలు

పాలనను పల్లెకు చేర్చిన ఘనత

గ్రామంలోనే అన్నిరకాల సేవలు

మినీ కలెక్టరేట్‌గా సచివాలయాలు

ఆర్‌బీకేలతో అన్నదాతలకు భరోసా

చెంతకే వచ్చి వైద్యం

ప్రభుత్వ బడులకు జీవం పోసిన నాడు–నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement