గజలక్ష్మిగా మావుళ్లమ్మ | - | Sakshi
Sakshi News home page

గజలక్ష్మిగా మావుళ్లమ్మ

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

గజలక్ష్మిగా మావుళ్లమ్మ నిబంధనలు మీరితే చర్యలు టెట్‌కు 43 మంది గైర్హాజరు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

భీమవరం (ప్రకాశంచౌక్‌): పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉత్సవమూర్తికి గజలక్ష్మి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద ఎత్తున గాజుల అలంకరణ చేస్తామని అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ద మహాలక్ష్మి నగేష్‌, చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలిపారు.

నరసాపురం: ప్రభుత్వ ఆహార సరఫరాకు సంబంధించి నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన నరసాపురంలో పర్యటించారు. పట్టణం, మండలంలోని పలు రేషన్‌ దుకాణాలు, ఏఎంసీ గోడౌన్‌, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఏఎంసీ స్టాక్‌ పాయింట్‌ నుంచి సరఫరా అవుతున్న సరుకుల కొలతల్లో తేడాలుంటున్నాయని రేషన్‌ డీలర్లు ఫిర్యాదు చేయడంతో చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్‌ డీటీకి మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌ డీలర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. నరసాపురం, ఎల్‌బీచర్ల గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. అందిస్తున్న ఆహారంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని లెనిన్‌ మున్సిపల్‌ స్కూల్‌లో బోధనా పద్ధతులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై హెచ్‌ఎం కృషిని అభినందించారు.

భీమవరం: పట్టణంలోని డీఎన్నార్‌, ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో శుక్రవారం నిర్వహించిన టెట్‌ పరీక్షలకు 43 మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఓవీఎస్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. 451 మందికిగాను 408 మంది హాజరయ్యారని చెప్పారు.

318 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్‌ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన టెట్‌ పరీక్షలకు 318 మంది హాజరయ్యారు. ఉదయం 175 మందికి 162 మంది, మధ్యాహ్నం 174 మందికి 156 మంది హాజరయ్యారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం కేంద్రాలను తనిఖీ చేసిందని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

భీమవరం అర్బన్‌: ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని జేసీ కేఆర్‌ కల్పశ్రీ ఆదేశించారు. గొల్లవానితిప్ప పంచాయతీ గొందిలో సర్కార్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌కు సంబంధించిన లే అవుట్‌ను శుక్రవారం ఆమె పరిశీలించారు. హౌసింగ్‌, రెవెన్యూ అధికారులు 21 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి గుర్తించారు. లబ్ధిదారులను జేసీ కలిసి వారితో మాట్లాడారు. భూముల రికార్డులను పరిశీలించి అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ రావి రాంబాబు, సర్వేయర్‌ ప్రవీణ్‌, వీఆర్వో పుల్లయ్య ఉన్నారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలోకి నీరు చేరడంతో ప్రవాహం పెరిగింది. వారం రోజులుగా వరద తగ్గుతూ పెరుగుతూ నిలకడగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 2.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement