షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులకు ముడుపులు! | - | Sakshi
Sakshi News home page

షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులకు ముడుపులు!

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

నలుగురి నుంచి రూ.40 లక్షల వసూలు

ఆరోపణలతో నిలిచిన నియామక ప్రక్రియ

డిప్యుటేషన్‌తో నెట్టుకొస్తున్న వైనం

చర్చనీయాంశంగా సొమ్ముల వసూలు

లోసరిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

భీమవరం: భీమవరం నియోజకవర్గంలో కూటమి పాలనలో అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్ల నియామకాల కోసం భారీగా డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. నిధులు పంపిణీలో తేడాల కారణంగా నియామకాల్లో జాప్యం జరగడంతో, ప్రస్తుతం వేరే సబ్‌స్టేషన్ల సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించి నెట్టుకొస్తున్నారు.

సబ్‌స్టేషన్ల ఏర్పాటు : భీమవరం రూరల్‌ మండలం లోసరి గ్రామం పరిసరాల్లో లో ఓల్టేజీ సమస్యతో ప్రజలు, ముఖ్యంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్‌ లేకపోవడంతో విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గత జగన్‌ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తదనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీని నిర్మాణానికి సుమారు రూ.3.80 కోట్లు మంజూరు చేసింది. ఈ సబ్‌స్టేషన్‌ ద్వారా పరిసరాల్లోని 16 గ్రా మాలకు లో ఓల్టేజీ సమస్య తీరనుంది.

నియామకాల్లో అవకతవకలు.. ఆరోపణలు

సబ్‌స్టేషన్‌ నిర్వహణను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఆ ఆపరేటర్ల నియామకం కాంట్రాక్టరే చే యాల్సి ఉండగా, పోస్టులకు డిమాండ్‌ పెరగడంతో రాజకీయ సిఫార్సులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధి నలుగురు షిఫ్ట్‌ ఆపరేటర్‌ పో స్టుల భర్తీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. అయితే, కాంట్రాక్టర్‌కు తెలియకుండా ఈ వసూళ్లు జరగడంతో నియామక ప్ర క్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం సబ్‌స్టేషన్‌ ప్రారంభమైనా వేరే ప్రాంతాల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై రప్పించి పనులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పోస్టింగ్‌లు, నామినేటెడ్‌ పదవుల పేరుతో పెద్దఎత్తున వసూళ్లు జరుగుతున్నాయనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement