● పెరుగుతున్న ఉల్లి ధరలు
● కిలో రూ.40
● మహారాష్ట్ర పంటే దిక్కు
తాడేపల్లిగూడెం: మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారం రోజులుగా ధరలు ఎగబాకుతుండటంతో, గతంలో లభించిన తక్కువ ధరల విక్ర యాలు ఆగిపోయాయి. ఆదివారం నాటి హోల్‌సేల్ మార్కెట్‌లో సాధారణ రకం ఉల్లి క్వింటాలు రూ.2,800 పలకగా, నాణ్యమైన రకం రూ.3,400 కు చేరింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.40 కి చేరింది.
మహారాష్ట్ర ఉల్లిపైనే ఆధారం
ప్రస్తుతం దేశీయ మార్కెట్లకు మహారాష్ట్ర ఉల్లిపాయలే ప్రధాన దిక్కుగా మారాయి. నాబార్డు రుణ సదుపాయంతో నిర్మించిన బహిరంగ గోదాముల వల్ల ఇక్కడి ఉల్లి 90 రోజులకు పైగా నిల్వ ఉంటుంది. మార్కెట్ అవసరాలను బట్టి రైతులు సరుకును సరఫరా చేస్తుంటారు. ఈ ఉల్లి పైపొరలపై నల్లమచ్చలు (కాటుక) వచ్చినా కుళ్లిపోవు. అందువల్ల వీటిని ఎక్కువగా వాడతారు. సాధారణంగా ఖరీఫ్, రబీ సీజన్లలో కర్నూలు వంటి ప్రాంతాల నుంచి వచ్చే దిగుబడులు ధరలను అదుపులో ఉంచుతాయి.
కర్నూలుపై ఎల్‌నినో ప్రభావం
కర్నూలులో ఉల్లి పంట 80 శాతం వర్షాధారం. అ యితే ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు తీవ్రంగా దెబ్బతింది. కర్నూలు జిల్లాలో 19,242 హెక్టార్ల సాగు లక్ష్యానికి కేవలం 2,349 హెక్టార్లలోనే పంట వేశారు. నంద్యాలలో 4,583 హెక్టార్లకు గాను 251 హెక్టార్లలోనే నారు వేశారు. గత సీజన్లలో 7.50 లక్షల టన్నుల దిగుబడి రాగా, అందులో 2.64 లక్షల టన్నులు తెలుగు రా ష్ట్రాలతో పాటు కర్ణాటకకు ఎగుమతి అయ్యేవి. తా డేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఈ సరుకు పశ్చిమ బెంగాల్, అసోం, బంగ్లాదేశ్, మలేషియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. కానీ ఈసారి వానలు లేక రైతులు నారు పోసే పరిస్థితి కూడా లేదు. భవిష్యత్తులో ఉల్లి కొరత మరింత తీవ్రమై, ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.


