కలిదిండి(కై కలూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ (మెన్ – ఉమెన్) ఇక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షి ప్ – 2026 పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరి ఈద్గా షాదీఖానా వేదికగా సోమవారం జరిగాయి. ఈ పోటీల్లో కలిదిండి ప్లాటినం జిమ్ క్రీడాకారుడు పెద్దిరాజు ప్రతిభ కనబరిచి కాంస్య పతకం కై వసం చేసుకున్నాడు. స్క్వాట్ విభాగంలో 225 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 110 కేజీలు, డెడ్‌లిఫ్ట్ విభాగంలో 215 కేజీల బరువును ఎత్తి జడ్జీల నుంచి ప్రశంసలు అందుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యమని పెద్దిరాజు పేర్కొన్నారు.


