హాస్టల్‌లో సమస్యలపై కలెక్టర్‌కు మొర
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే ఏపీ బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెకు హాస్టల్‌లోని సమస్యలపై మొర పెట్టుకున్నారు. హాస్టల్‌లో స్నానానికి సరైన నీళ్లు ఉండడంలేదని, వచ్చిన నీళ్లతో స్నానం చేస్తుంటే చర్మ వ్యాధులు వస్తున్నాయమని ఓ విద్యార్థి తన ఒంటిపై ఉన్న మచ్చలను చూపించారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని కొందరు వాపోయారు. టిఫిన్, భోజన సమయాల్లో మంచినీళ్లు ఇవ్వడం లేదని, తిన్నా రెండు గంటలకు నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. పుస్తకాలు పెట్టుకోవడానికి సరైన డెస్క్‌లు లేవని, భోజనంలో సరపడనంత కూరలు వేయడం లేదని, జ్వరం వస్తే కనీసం ధర్మామీటరు కూడా పెట్టి చూడడం లేదని, ఫ్యాన్లు సరిపోవడం లేదని, బాత్రూమ్‌లకు డోర్‌లు, లైట్లు లేవని విద్యార్థులు కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ముందుగా ఆర్‌డబ్యూఎస్ అధికారులకు నీటి సమస్య వివరించి పరీక్షలు నిర్వహించాలని డీఈవోకు సూచించారు.
లక్ష్యసాధనకు కృషి చేయాలి
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించేలా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులంతా ఒక కుటుంబంలా మెలగాలన్నారు. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదువుకుంటే పదవ తరగతి కూడా చిన్నదేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని గుర్తుంచుకుని విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ పర్యవేక్షణ చేస్తుండగా కరెంట్ కట్ అవ్వడంతో సెల్‌ఫోన్ వెలుతురులోనే విద్యార్థులకు భోజనాలు ఏర్పాటుచేశారు. కనీసం జనరేటర్ కూడా వేయకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో డీఈవో ఈ నారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సూరిబాబు, తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్, ఎంఈవో గుమ్మల్ల వీరాస్వామి, ఆర్‌ఎమ్‌ఎన్‌వీ శర్మ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జి సూర్యకుమారి, పి శ్రీదేవి, వార్డెన్ కె ప్రవీణ్, వీఆర్‌వో వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్‌లో సమస్యలపై కలెక్టర్‌కు మొర
హాస్టల్‌లో సమస్యలపై కలెక్టర్‌కు మొర


