ఒక్కసారిగా తగ్గాయి
ఏడాది పాటు మంచి ధర పలికిన కొబ్బరి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కొబ్బరి దింపు, వలుపు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు తగ్గితే దింపులు గగనమే. ధరలు ఇంకా పతనమవుతాయనని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి కొబ్బరి ధరలు నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– పంజా సురేష్, రైతు, పంజా వేమవరం
పది రోజులుగా కొబ్బరి ఎగుమతులు మందగించాయి. నెల రోజుల్లో వెయ్యి కాయల ధర రూ.10 వేలకు పైగా తగ్గింది. ఏడాదిగా ధరలు బాగుండడంతో రైతుల నుంచి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో కాయలు నిల్వ చేశాం. ప్రస్తుతం ధరలు తగ్గడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి.
– గంధం త్రినాథులు,
కొబ్బరి వ్యాపారి, మేడపాడు
కొన్ని నెలలుగా ధరలు పెరుగుతుండటంతో రైతుల నుంచి కొబ్బరి కొనుగోలు చేసి నిల్వ చేశాను. ధరలు మరింత పెరుగుతాయని ఆశించిన తరుణంలో ఒక్కసారిగా తగ్గిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. ఎగుమతులు లేకపోవడం మరింత ఇబ్బందికరం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– మల్లుల శేషయ్య,
కొబ్బరి వ్యాపారి, నవుడూరు
ఒక్కసారిగా తగ్గాయి
ఒక్కసారిగా తగ్గాయి


