ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ పోటీలు
నూజివీడులో బాస్కెట్‌బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న డీఈఓ వెంకటలక్ష్మమ్మ
పోటీల్లో తలపడుతున్న కృష్ణ, ప్రకాశం బాలుర జట్లు
నూజివీడు: రాష్ట్రస్థాయి బాస్కెట్ పోటీలు నూజివీడులో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. బాస్కెట్‌బాల్ పోటీలను జిల్లా డీఈఓ వెంకటలక్ష్మమ్మ ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా తర్ఫీదు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, డీవైఈఓ పీఎస్ సుధాకర్, బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కరస్పాండెంట్ బండి శ్యామ్, ఎస్‌జీఎఫ్ ఏలూరు జిల్లా సెక్రటరీ అలివేలు మంగ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా సెక్రటరీ ఐ.రమేష్, అబ్జర్వర్ డీ కృష్ణమోహన్, కార్యనిర్వాహక కార్యదర్శి వాకా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహభరితంగా పోటీలు
బాలికల, బాలుర జట్ల మధ్య బాస్కెట్‌బాల్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. బాలికల విభాగంలో గుంటూరు జట్టు విజయనగరం జట్టుపై 38–04 తేడాతో, పశ్చిమగోదావరి జట్టు చిత్తూరు జట్టుపై 30–19 తేడాతో, తూర్పుగోదావరి జట్టు శ్రీకాకుళంపై 31–2 తేడాతో, అనంతపురం జట్టు ప్రకాశం జట్టుపై 15–0 తేడాతో, కృష్ణా జట్టు వైఎస్సార్ కడప జట్టుపై 15–3 తేడాతో గెలుపొందాయి. బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు శ్రీకాకుళంపై 30–3 తేడాతో, వైజాగ్ జట్టు చిత్తూరుపై 33–30తో, నెల్లూరు జట్టు వైఎస్సార్ కడపపై 22–10తో, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై 27–0తో, కృష్ణా జట్టు ప్రకాశంపై 33–05 తేడాతో గెలుపొందాయి.
ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ పోటీలు


