వైఎస్సార్‌సీపీలో నియామకాలు
యడ్ల తాతాజీ
మహ్మద్ అబీబుద్దీన్
పేరిచర్ల విజయ నరసింహరాజు
పులుపు అనిల్‌కుమార్
భీమవరం: భీమవరం మండలానికి చెందిన పేరిచర్ల విజయ నరసింహరాజు (నర్సింబాబు) వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు నియామకం చేసినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం తెలిపింది. విజయ నరసింహరాజు భీమవరం మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా తాతాజీ
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పాలకొల్లుకు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ యడ్ల తాతాజీని నియమించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.
జాయింట్ సెక్రటరీలుగా..
అత్తిలి: ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన పులుపు అనిల్‌కుమార్, అత్తిలి గ్రామానికి చెందిన మహ్మద్ అబీబుద్దీన్‌లను పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా నియమించారు. దీనిపై వారు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
వైఎస్సార్‌సీపీలో నియామకాలు


