రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం | - | Sakshi
Sakshi News home page

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం

Nov 22 2025 7:16 AM | Updated on Nov 22 2025 7:16 AM

రోడ్ల

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం

చేతులెత్తేసిన సర్కారు

తీవ్రమైన అలసట

భయం భయంగా..

వెన్ను సమస్యలతో..

భీమవరానికి చెందిన 25 ఏళ్ల వెంకటేష్‌ మార్కెటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాడు. కొద్దిరోజుల క్రితం సాధారణంగా మొదలైన వెన్నునొప్పి రానురానూ ఎక్కువైంది. వైద్యుడిని సంప్రదించగా గోతుల రోడ్లతో వెన్నెముక డిస్క్‌లపై ఒత్తిడి పెరిగినట్టు గుర్తించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
చేతులెత్తేసిన సర్కారు

సాక్షి, భీమవరం: ఇటీవల కాలంలో వెన్ను స మస్యలతో ఆస్పత్రులను ఆశ్రయించే యువత సంఖ్య పెరుగుతోంది. వీరిలో మోటారు సైకిళ్లు, కార్లు, బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్యవర్గాలు అంటున్నాయి. అడుగుకో గుంతతో అధ్వానంగా ఉన్న రోడ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గోతులతో వెన్నుపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి, మెడ నొప్పి, స్లిప్‌ డిస్క్‌ సమస్యలకు దారితీస్తున్నాయి. మొదట్లో తేలికపాటిగా మొదలై తర్వాత తీవ్రనొప్పిలోకి దించేస్తున్నాయి. బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో ఈ గోతుల రోడ్లపై కొద్ది దూరం ప్రయాణిస్తే చాలు నడుం పట్టేసిందన్న మాటలే వినిపిస్తున్నాయి.

గుంతల్లో పడి వెన్నెపోటు

● వాహనం గుంతలో పడినప్పుడు వెన్నెముకపై ఆకస్మికంగా ఒత్తిడి పడి వెన్నునొప్పి వస్తుంది. ఇది సాధారణ నడుము నొప్పి నుంచి తీవ్రమైన వెన్నునొప్పి వరకు ఉండవచ్చు.

● వెన్నెముక కండరాలు అకస్మాత్తుగా బిగుసుకుపోతాయి, ఇది దీర్ఘకాలిక వెన్ను సమస్యలకు దారితీస్తుంది.

● వెన్నెముక డిస్క్‌లపై పడే ఒత్తిడి వల్ల అవి బయటకు వచ్చి, నరాలపై ఒత్తిడిని కలిగిస్తాయి.

● నరాలపై ఒత్తిడి వల్ల స్పర్శ కోల్పోవడం లేదా మూత్ర, మల విసర్జనపై నియంత్రణ కో ల్పోవడం వంటి సమస్యలు రావచ్చు.

● రోడ్లపై నిరంతర కుదుపుల వల్ల వెన్నెముక కీళ్లపై ఒత్తిడి పెరిగి, అవి క్రమంగా అరిగిపోతాయి.

● గోతులు, గడ్డల వల్ల ప్రమాదాలు జరిగి వెన్నెముకకు తీవ్రమైన గాయాలు కలిగే అవకాశం ఉంది.

● నడుము నొప్పి చికిత్స, హెర్నియేటెడ్‌ డిస్క్‌ సర్జరీ, డిస్క్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ, సయాటికా సర్జరీ, స్పైనల్‌ కార్డ్‌ ట్రీట్‌మెంట్‌, సయాటిక్‌ నర్వ్‌ ట్రీట్‌మెంట్‌ తదితర శస్త్రచికిత్సలకు దారితీయవచ్చు నని వైద్యులు అంటున్నారు.

● వాహనాల రద్దీతో రోడ్లలో దుమ్ములేచిపోయి ప్రయాణికులు ముక్కుమూసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు కళ్లల్లో దుమ్ముపడి నరకయాతన చూస్తున్నారు.

ఎమ్మెల్యేలకు సెగ

చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలైనా రోడ్ల సమస్య అలానే ఉంది. ఆర్‌అండ్‌బీ మంత్రికి చాలాసార్లు చెప్పాం, రోడ్లు బాగుచేయడం లేదని ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది, రోడ్ల్లపై తిరిగే పరిస్థితి లేకుండా ఉంది, రోడ్లు అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు రోడ్ల దుస్థితికి అద్దం పడుతున్నాయి. రోడ్లపై ప్రజలు తమను నిలదీస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

అత్తిలి పరిసర గ్రామాల నుంచి జిల్లా కేంద్రం భీమవరానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా మారాయి. అత్తిలి నుంచి వయా ఈడూరు, కంచుమర్రు మీదుగా భీమవరం వెళ్లే రోడ్లు పూర్తిగా పాడవ్వడంతో ఇటుగా ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నాం. భీమవరం వెళ్లి వచ్చేసరికి నడుము నొప్పితో పాటు తీవ్రమైన అలసట వస్తోంది. రోడ్లను ఆధునికీకరించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలి.

– బుడితి సుజన్‌కుమార్‌, అత్తిలి

రోడ్లపై ప్రయాణించాలంటే భయం భయంగా ఉంది. రోడ్లు ధ్వంసంతో ఏదైనా భారీ వాహనం వెళితే పెద్ద ఎత్తున దుమ్ము లేస్తుంది. వెనుక ద్విచక్ర వాహనంపై అదే దుమ్ములోంచి ప్రయాణించాల్సిన దుస్థితి వస్తుంది. కళ్లల్లో విపరీతంగా దుమ్ము పడి వాహనం నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నాసిరకం రోడ్ల మరమ్మతులతో సమస్యలు తప్పడం లేదు.

– ఎం.సూర్యారావు, పాలకోడేరు

పొలమూరు–నవుడూరు మధ్య రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణికులు క్షతగాత్రులు అవ్వడమే కాకుండా మృత్యువాత కూడా పడుతున్నారు. తరచూ ప్రయాణించే వారు వెన్ను సమస్యలతో బాధపడుతున్నారు. దుమ్ము, ధూళితో అనారోగ్యాల పాలవుతున్నారు. దాతలు ముందుకు వచ్చి మరమ్మతులు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

– మేనిడి సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్‌, పోలమూరు, పెనుమంట్ర మండలం

నడుం పడిపోతోంది

జిల్లాలో అధ్వానంగా రోడ్లు

వాహన చోదకులు, ప్రయాణికులకు వెన్ను సమస్యలు

వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో యువతే అధికం

మూణ్ణాళ్ల ముచ్చటైన రూ.42 కోట్ల మరమ్మతులు

జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 457 కి.మీ మేర స్టేట్‌ హైవే, 1,108 కి.మీ మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లు ఉన్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం తదితర కార్యకలాపాల నిమిత్తం రోజూ వేలాది మంది ఈ రోడ్లు మీ దుగానే రాకపోకలు సాగించాలి. అధికారంలోకి రావడమే ఆలస్యం రోడ్లను అద్దంలా మార్చేస్తాం. ఎక్కడా గుంతలన్నవే లేకుండా చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది. రూ.42.57 కోట్లతో 160 కి.మీ స్టేట్‌ హైవే, 538 కి.మీ మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లలో మరమ్మతులతో సరిపెట్టింది. చాలా చోట్ల నాసిరకంగా పనులు చేయడంతో కొద్దిరోజులకే రాళ్లు పైకిలేచి రోడ్డంతా చెల్లాచెదురై గోతులు మళ్లీ మొదటికొచ్చాయి. జిల్లాలోని తాడేపల్లిగూడెం–పత్తిపాడు, భీమవరం–తాడేపల్లిగూడెం, మోగల్లు– అత్తిలి, బ్రాహ్మణచెరువు–వీరవాసరం, సిద్దాంతం–పెనుగొండ, పెదకాపవరం–క్రొవ్విడి, నౌడూరు– కొండేపూడి తదితర రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పెద్దపెద్ద గోతులతో ప్రయాణికులను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. ద్విచక్ర వాహన చోదకుల తో పాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించేవారు భారీ కుదుపులకు లోనవుతున్నారు. రోజూ ప్రయాణాలు సాగించేవారు నడుం నొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నామ ని, వాహననాలు తరచూ మరమత్ములకు గురవుతున్నాయని వాపోతున్నారు.

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం 1
1/3

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం 2
2/3

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం 3
3/3

రోడ్లు ఘోరం.. ఒళ్లు హూనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement