అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
అత్తిలి: తణుకు పట్టణంలో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో తణుకు మూడో వార్డు టి.వేమవరం రోడ్డులో సకినాల వెంకట దుర్గ తాతేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్‌పెక్టర్ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. అతని నుంచి మూడు బాటిల్స్ విదేశీ మద్యం, 3 బాటిల్స్ డిఫెన్స్ మద్యం, రెండు బాటిల్స్ తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు హైదరాబాదు నుంచి మద్యం బాటిల్స్‌ని తీసుకొని వచ్చి తణుకు పరిసర ప్రాంతాలలో అధిక ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంపై అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.


