మెమరీ చాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాలు | - | Sakshi
Sakshi News home page

మెమరీ చాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాలు

Nov 21 2025 7:43 AM | Updated on Nov 21 2025 7:43 AM

మెమరీ చాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాలు

మెమరీ చాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాలు

జంగారెడ్డిగూడెం: ఈనెల 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఏషియా ఓపెన్‌ మెమరీ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ స్కూల్‌ అకాడమిక్‌ డైరెక్టర్‌ సుభాష్‌, ప్రతిభా సరోజ్‌ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీలను ఇండియన్‌ మెమరీ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐఎంఎఫ్‌ఎస్‌), ఏషియా మెమరీ స్పోర్ట్స్‌ అలయన్స్‌ (ఏఎంఎస్‌ఏ) సంయుక్తంగా నిర్వహించాయి. భారత్‌తో పాటు ఫిలిప్పీన్‌, మలేషియా, సింగపూర్‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో టీమ్‌ ఇండియా తరుఫున సుభాష్‌, సరోజ్‌ ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహించారు. కిడ్స్‌ కేటగిరీలో ప్రతిభ సరోజ్‌, అడల్డ్స్‌ కేటగిరీలలో సుభాష్‌ ఇద్దరూ బైనరీ నంబర్స్‌, రాండమ్‌ వర్డ్స్‌, స్పోకెన్‌ నెంబర్స్‌, రాండమ్‌ నెంబర్స్‌, రాండమ్‌ కార్డ్స్‌ ఈ ఐదు విభాగాల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో వీరిని సత్కరించి పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement