డిసెంబరు 13న లోక్ అదాలత్
భీమవరం: రాజీ చేసుకుంటే ఇరుపార్టీలు నెగ్గినట్లేనని, రాజీ వల్ల కాలం, వ్యయం ఆదా అవుతాయని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీ నారాయణ అన్నారు. తీయ లోక్ అదాలత్‌లో కేసుల రాజీకి తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం న్యాయమూర్తి పత్రికా సమావేశం నిర్వహించారు. ముందస్తు లోక్ అదాలత్ సిట్టింగులు పెట్టి కేసులు రాజీకి ప్రయత్నం చేస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం కాబట్టి కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులకు శ్రీభారత రాజ్యాంగం–సామాజిక బాధ్యత్ఙ అంశంపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నవంబరు 26న మెమోంటో, సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో భద్రతా వైఫల్యం కారణంగా ఓ భక్తుడు శుక్రవారం శ్రీవారి మూలవిరాట్‌ను సెల్‌ఫోన్‌తో ఫొటో తీశాడు. ఫొటో వాట్సప్ స్టేటస్‌లో పెట్టడంతో కలకలం రేగింది. కామవరపుకోటకు చెందిన ఓ భక్తుడు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాడు. బయటకు వెళ్లే సమయంలో సెల్‌ఫోన్‌తో మూలవిరాట్‌్‌ను ఫొటో తీశాడు. దేవస్థానం సిబ్బంది గమనించక పోవడంతో బయటకు వెళ్లిపోయాడు. ఫొటోను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. భక్తులు ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పలువురు భక్తులు ఫోన్లతోనే ఆలయంలోకి వెళ్లిపోతున్నారు. మెటల్ డిటెక్టర్‌లతో తనిఖీలు చేయకపోవడం, సీసీ కెమేరాల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు ఒక కారణమని అంటున్నారు.
డిసెంబరు 13న లోక్ అదాలత్


