సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం
భీమవరం: భీమవరం సమగ్ర శిక్షలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు అడిషినల్ ప్రాజెక్ట్ ఆఫీస్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందించారు. జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు బావాజీ మాట్లాడుతూ తక్కువ జీతాలతో ఉద్యోగులు కుటుంబాలను పోషించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మినిమం టైం స్కేల్ హామీ అమలు చేయకుంటే ఊరుకోబోమన్నారు. తక్షణమే మినిమం టైమ్ స్కేల్, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, లేకుంటే పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.
భీమవరం: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే కౌలు రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయాన్ని భూస్వాములకు, భూయజమానులకు అందించడాన్ని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా విమర్శించింది. ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు శుక్రవా రం ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ క ల్యాణ్ రాష్ట్రంలో కౌలు రైతులను పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు తప్పుడు వా గ్దానాలు చేసి కౌలు రైతులను నిలువునా మో సం చేశారని విమర్శించారు. కౌలు రైతులు, పేద రైతులను గుర్తించి తక్షణమే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు.
భీమవరం: పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పాఠశాలల పనిదినాల్లో మాత్రమే అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ ఎల్‌వీ చలం కోరారు. ప్రణాళికను బలవంతంగా అమలు చేయరాదని, గతేడాది ప్రకటించిన సీసీఎల్ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులు మానసికంగా ఆనందంగా ఉంటేనే ప్రణాళిక ఉద్దేశం నెరవేరుతుందన్నారు. సెలవు రోజుల్లో ప్రణాళిక ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భీమవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను డీఈఓ ఈ.నారాయణ శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 16న ప్రారంభం కానున్న పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు వ రకూ జరుగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (గ్రూప్ ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోసిట్ కోర్స్), 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లిష్, 23న మేథమెటిక్స్, 25న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 (సాంస్కృతం, అరబిక్, పర్సియన్), 1న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సాంస్కృతం, అరబిక్, పర్సియన్), ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును శుక్రవారం కేంద్ర జల సంఘం ప్రతినిధులు పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జలసంఘం డిజైన్‌లు, పరిశోధన విభాగం సభ్యుడు ఆదిత్య శర్మ, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎస్ భక్షిలతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో జరుగుతున్న ప్రతి పనినీ క్షుణ్ణంగా పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, డిజైన్‌ల ప్రకారం ఏ విధంగా, ఎంతవరకు జరుగుతున్నాయి అనే విషయాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరికి జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె.న రసింహమూర్తి, ఎస్‌ఈ కె.రామచంద్రరావు, క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈ కె.శేషుబాబు పనుల వివరాలను తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి మొత్తం పనుల వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ అధికారులు చూపించి వివరించారు.
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం


