శ్రీవారి క్షేత్రంలో పారిశుద్ధ్య పనులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాక్షి దినపత్రికలో శ్రీఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటిశ్రీ శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఆ రోజు అనివేటి మండపంలో తూతూమంత్రంగా నిర్వహించిన పనులపై శుక్రవారం శ్రీశ్రీవారి క్షేత్రంలో హడావుడిగా స్వచ్ఛత పనులుశ్రీ శీర్షికన మరో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆలయ అధికారుల ఆదేశాలతో పారిశుధ్య కార్మికులు మళ్లీ అనివేటి మండపంలో దశావతారాల విగ్రహాలను సోప్ ఆయిల్‌తో శుభ్రం చేశారు. స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న శ్రీవారి కల్యాణ మండపంలోని శిల్ప సంపదను సిబ్బంది వాటర్ జెట్ మెషిన్‌తో శుభ్రం చేశారు. సాక్షి కథనాలతో అధికారులు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ దిగొచ్చింది. పారిశుధ్య కార్మికుల బ్యాంక్ అకౌంట్లకు శుక్రవారం గత నెల వేతన సొమ్ములను జమ చేసింది.
కై కలూరు: పామర్రు – దిగమర్రు(165) జాతీయ రహదారి ఇరువైపుల ప్రైవేటు సంస్థల ప్రచార బోర్డులు వల్ల ప్రమాదాలు జరుగుతున్న తీరుపై ఈ నెల 17న శ్రీప్రచార యావ.. ప్రమాదాలకు తోవశ్రీ అనే శీర్షికతో సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై కై కలూరు పంచాయతీ అధికారులు స్పందించారు. ఈవో వై.ప్రసాద్ ఆదేశాలతో శానిటరీ ఇన్స్‌పెక్టర్ శ్రీరంగం సిబ్బందితో కలసి శుక్రవారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. కై కలూరు టౌన్‌హాలు వద్ద ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులను తీసివేశారు. పంచాయతీ ఈవో ప్రసాద్ మాట్లాడుతూ కొంతమంది పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా రాత్రి వేళల్లో బోర్డులు రోడ్డు పక్కనే ఏర్పాటు చేస్తున్నారన్నారు.
శ్రీవారి క్షేత్రంలో పారిశుద్ధ్య పనులు


