మద్ది క్షేత్రంలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఆఖరిరోజు స్వామి వారిని దర్శిచుకునేందుకు జంగారెడ్డిగూడెం మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నెలరోజుల పాటు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అధికారులకు, ఆయా శాఖల సిబ్బందికి ఈవో ధన్యవాదాలు తెలిపారు.
మండవల్లి: మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసు స్టేషన్ వద్ద సీఐ రవికుమార్ గురువారం వివరాలను వెల్లడించారు. మండవల్లి, లోకుమూడి, మణుగునూరు గ్రామాల్లో మోటారు సైకిళ్లు చోరీ జరుగుతుండడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొవ్వాడలంక వద్ద ముగ్గురు నిందితలను ఎస్సై రామచంద్రరావు అరెస్టు చేశారు. నిందితులు పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం గంగుపల్లి తండాకు చెందిన రామవత్ దుర్గాప్రసాద్ నాయక్, (మైనర్ బాలుడు), సీతారామపురం తండాకు చెందిన బాణావత్ తులసిబాబునాయక్‌గా గుర్తించారు. నిందితుల నుంచి 5 బైకులు, రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అత్తిలి: రాష్ట్రంలో దివ్యాంగులు తమ వైకల్యం శాతం నిర్ధారణ పరీక్షల కోసం నెలలు తరబడి వేచి చూస్తూ అనేక ఇబ్బందులకు గురౌతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బుడితి సుజన్ కుమార్ పేర్కొన్నారు. సదరం స్లాట్ బుకింగ్ ఆన్‌లైన్‌లో మాత్రమే అమలులో ఉన్నందున సాంకేతికమైన కారణాలతో స్లాట్ బుకింగ్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోతుందని దీంతో దివ్యాంగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, సదరం స్లాట్ బుకింగ్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా అమలు చేసేలా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించాలని కోరారు. నూతన పింఛన్లు కోసం నిరంతరం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని, వెరిఫికేషన్ వెనువెంటనే పూర్తి చేసి దివ్యాంగులకు ఫించన్ మంజూరు చేయాలని సుజన్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
మద్ది క్షేత్రంలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు
మద్ది క్షేత్రంలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు


