పశువధపై మొద్దు నిద్ర | - | Sakshi
Sakshi News home page

పశువధపై మొద్దు నిద్ర

Aug 19 2025 6:47 AM | Updated on Aug 19 2025 6:47 AM

పశువధ

పశువధపై మొద్దు నిద్ర

రాజకీయ సహకారంతోనే..

తణుకు అర్బన్‌: తణుకు మండలం తేతలి గ్రామం పశు ఘోషతో అల్లాడుతోంది. పశువులను నిర్ధాక్షిణ్యంగా వధిస్తున్నప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడంతో బాధితులకు కంఠశోషే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి పశువధ శాల తెరచుకుంది. అక్కడి నుంచి వస్తున్న దుర్వాసనకు తేతలి గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. స్థానికంగా ఇళ్లలో ఉండలేకపోతున్నామని పశువధ శాలను మూయించాలని వేడుకుంటున్నారు. పశువధ శాల చుట్టూ 200పైగా ఇళ్లు ఉన్నా కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళలపై దాడులకు దిగిన వైనం

పశు వధను నిలిపివేయాలని బాధితులు కర్మాగారం వద్ద నిరసనలు తెలుపుతూ వ్యాన్‌లను అడ్డుకుంటే దాడులు చేశారు. రోడ్డుపై బైఠాయిస్తే కేసులు పెట్టారు. పశువధను నిలిపించమని కాళ్లు పట్టుకుంటామన్నామని, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని బాధితులు మండిపడుతున్నారు. శాంతియుతంగా చేస్తున్న నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారని, ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని బాధిత వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి.

టీడీపీ, జనసేన కార్యాలయాలకు వెళ్లినా..

పశువధ శాల బాధితులు తాడోపేడే తాడేపల్లిలోనే తేల్చుకుంటామని మంగళగిరిలోని టీడీపీ, జనసేన కార్యాలయాలకు బస్సులు వేసుసుని వెళ్లి వినతిపత్రాలు అందచేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. పశువధకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో చోద్యం చూస్తున్న జనసేన, బీజేపీ వర్గాలపైనా బాధితులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో అంటకాగుతూ బీజేపీ నాయకులు సైతం పశుఘోషలో భాగస్వామ్యమయ్యారని మండిపడుతున్నారు.

మూడు జిల్లాల నుంచి పశువుల తోలకం

తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న పశువధ శాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలతోపాటు ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి పశు బేరగాళ్లు పశువులను రవాణా చేస్తున్నారు. దొంగిలించిన గేదెలు సైతం తేతలిలోని పశువధ శాలకు తోలుకువస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు జిల్లాల నుంచి తమ గేదెలు దొంగిలించారంటూ పశుపోషకులు తణుకు ప్రాంతానికి వచ్చి వెతుకులాడే పరిస్థితి తెచ్చారు. గతంలో తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పశుశాలలో దొంగిలించిన రెండు ఖరీదైన గేదెలు కూడా ఇదే పశువధ శాలకు తరలించారని అందుకే పోలీసులు రికవరీ చేయలేకపోయారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి.

ఆందోళనకు మద్దతు పలికిన వైఎస్సార్‌సీపీ

పశువధ శాల నుంచి దుర్వాసన వస్తుందని బాధితులు నిరసన తెలిపిన వెంటనే వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పట్లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పశువధ శాల నిర్వహణకు తెరదించుతూ తాళాలు వేయించారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి పశువధ శాల గేట్లు తెరచుకున్నాయని, నిర్వహణ మొదలుపెట్టడంతో దుర్వాసనతో ఉండలేకపోతున్నామని స్థానిక బాధితులు రోడ్డెక్కగానే వైఎస్సార్‌సీపీ తరపున కారుమూరి వారికి అండగా నిలిచారు.

దుర్వాసనతో ఉండలేకపోతున్నామని బాధితుల ఆందోళన

టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం

కర్మాగారానికి నిత్యం వ్యాన్‌లలో పశువులు

గేదెలు అపహరణకు గురవుతున్నాయని పశుపోషకుల ఫిర్యాదు

వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందిన పచ్చని తణుకు పరిసర ప్రాంతంలో పశువధ వద్దంటూ ప్రజలు రోడ్డెక్కినా ప్రభుత్వం దిగి రాలేదు. పశువుల నుంచి చిమ్ముతున్న రక్తం ఈ ప్రాంతానికి మంచిది కాదన్నా వినలేదు. చివరకు ఆ ప్రాంత వాసులు దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని రోడ్డెక్కితే కేసులు పెట్టారు. పంచాయితీ ఎన్‌ఓసీ లేదని, ఆ కర్మాగారానికి ఎలాంటి అనుమతులు లేవని, వారు చూపిన సౌకర్యాలు అక్కడలేవని నిర్ధారణ చేసినా కానీ రాజకీయ ప్రోత్సాహంతో పశువధ నేటికీ ముమ్మరంగా సాగుతోంది.

– జల్లూరి జగదీష్‌, గోసేవాసమితి సభ్యులు

పశువధపై మొద్దు నిద్ర 1
1/2

పశువధపై మొద్దు నిద్ర

పశువధపై మొద్దు నిద్ర 2
2/2

పశువధపై మొద్దు నిద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement