రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు రెండో రోజు శుక్రవారం పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయంలో కొనసాగాయి. వ్యక్తిగత, జంట విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఐదు రకాల వయసు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 23 జిల్లాల నుంచి యోగ సాధకులు పాల్గొన్నారు. 24 మందిని విజేతలను ప్రకటించారు. వీరికి నిట్ డీన్ జీఆర్కే శాస్త్రి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. పోటీలు 24 వరకు జరగనున్నాయి.
– తాడేపల్లిగూడెం(టీఓసీ)
యోగాతో ఆరోగ్యం..ఆహ్లాదం
యోగాతో ఆరోగ్యం..ఆహ్లాదం
యోగాతో ఆరోగ్యం..ఆహ్లాదం