
సమస్యలు పరిష్కరించాలని వినతి
కై కలూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ న్యాయవాదులు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కై కలూరు కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురజాడ ఉదయశంకర్ అధ్యక్షతన నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాదుల ప్రమాద బీమా నగదు రూ.4 లక్షలకు ప్రభుత్వం మరో రూ.6 లక్షలు కేటాయించాలన్నారు. జూనియర్ కోర్టు పరిధి కేసులను రూ.20 లక్షల నుంచి తగ్గించాలన్నారు. న్యాయవాదులకు హెల్త్ బీమా స్కీంను వర్తింపచేయాలన్నారు. స్థానిక సబ్‌కోర్టు నిర్మాణానికి ఎస్టిమేట్ సరిపోలేదని దీనిని రూ.కోటి 77లక్షలకు పెంచాలన్నారు. మంత్రి స్పందిస్తూ ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: భీమడోలు పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై శుక్రవారం ఏలూరు డీఎల్‌పీవో బృందం విచారణ నిర్వహించింది. ఐదు నెలల కాలంలో రూ.కోటికి పైగా నిధులు పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేసినట్లు పంచాయతీ పరిధిలోని నాచేటిగుంటకు చెందిన కొత్తపల్లి చంద్రమౌళి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో భీమడోలు పంచాయతీ కార్యాలయంలో డీఎల్‌పీవో అమ్మాజీ విచారణ చేశారు. పంచాయతీలోని రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. కార్యదర్శి కేవీ తనూజ, ఫిర్యాదుదారుడైన, దళిత నాయకుడు కొత్తపల్లి చంద్రమౌళిల నుంచి వేర్వేరుగా స్టేట్‌మెంట్లు స్వీకరించారు. అనంతరం డీఎల్‌పీవో మాట్లాడుతూ రిజిస్టర్లు, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించి, తగు నివేదికను కలెక్టర్‌కు నివేదిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాము సునీతా, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి