
సాంకేతికతతో సాధికారత
తాడేపల్లిగూడెం: సాంకేతిక నైపుణ్యాలతోనే యువత సాధికారత సాధించవచ్చని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ కెరీర్ అలుమ్ని అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీబి.వీరేశ్‌కుమార్ అన్నారు. నిట్‌లో శుక్రవారం కార్పొరేట్ ఫెస్టు జరిగింది. వీరేశ్‌కుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో రాణించడానికి సమకాలీన, సృజనాత్మకత ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. మెర్సిడెస్ బెంజ్ సీనియర్ ఇంజనీర్ అయ్యర్ భట్టాచార్య మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం అన్నారు. టి.హబ్ డైరెక్టర్ అవినాష్ కేదార్ అంకుర పరిశ్రమలు ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. ఫ్యూజీటెక్ ఉపాధ్యక్షుడు చాణిక్య, ప్లేస్‌మెంటు ఆఫీసర్ శంకర్, 23 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. శనివారం ప్రాజెక్టు ఎక్స్‌పో నిర్వహించనున్నారు.