
శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం పవిత్రాధివాసం, బుధవారం పవిత్రారోహణ కార్యక్రమాలు జరుగుతాయని, గురువారం జరిగే పవిత్రావరోహణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని శ్రీవారి ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు.
యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన గోకవరపు కృష్ణ (32) ఆదివారం గోదావరిలో గల్లంతైన సంగతి తెలిసిందే. అతని కోసం గోదావరిలో గాలించగా సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్‌రాజు తెలిపారు.
దెందులూరు: కొల్లేరులో గేదెలు మేపడానికి వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. పైడి చింతపాడు గ్రామ వీఆర్‌ఓ శ్రీరామమూర్తి కథనం ప్రకారం పైడిచింతపాడు గ్రామానికి చెందిన నోరు రామారావు (38) స్థానికంగా కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం గేదెలు మేపడానికి కొల్లేరులోకి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం కొల్లేరులో శవమై దొరికాడు. అతను వికలాంగుడు కావడంతో నీట మునిగి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘనపై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.

శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం