‘గురుకుల’ పరీక్షలు
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఐదో తరగతిలో ప్రవేశానికి 93 మందికి 83 మంది, ఇంటర్‌లో ప్రవేశానికి 206 మందికి 182 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రిన్సిపల్ బి.రాజారావు తెలిపారు. ఇంటర్మీడియల్ ప్రవేశ పరీక్షను గురుకులాల జిల్లా సమన్వయాధికారి బి.ఉమాకుమారి, ఐదో తరగతి పరీక్షలను ఎంఈఓ–2 పీఎంకే జ్యోతి పరిశీలించారు.
పుప్పాల, చెరుకువాడల నియామకం శుభ పరిణామం
తణుకు అర్బన్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారుల కమిటీలో జిల్లా నుంచి పుప్పాల వాసుబాబు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజులకు అవకాశం ఇవ్వడం, తూ ర్పుగోదావరి జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి, తోట త్రిమూర్తులను నియమించడం మంచి పరిణామమని శాసనమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుద ల చేశారు. ఎంతో అనుభవం, నేర్పు, ఓర్పు, ఎ త్తుగడలు వేసే సామర్థ్యం ఉన్న వీరి నా యకత్వం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్‌లో ప్రతి వారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను సోమవారం రద్దు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేశామని పేర్కొన్నారు.
ఉపాధి హామీ మేట్ తొలగింపు
ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాల పంచాయతీలో ఉపాధి హామీ పనుల మస్తర్లలో జరుగుతున్న అ క్రమాలపై ‘సాక్షి’లో ఈనెల 11న ప్రచురితమైన ‘సత్తాలలో ఉపాధి సిత్రాలు’, అలాగే ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతున్న అవకతవకలపై 12న ‘తెలంగాణలో ఉన్నా ఉపాధి సొమ్ము జమ’ కథనాలకు అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సత్తాలలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మేట్ నరెడ్ల శ్యామలాదేవిని విధుల నుంచి తొలగించినట్టు ఏపీఓ బిరుదుగడ్డ నాగరాజు తెలి పారు. అలాగే ఐఎస్ జగన్నాథపురంలో జరిపిన విచారణలో ఒకరికి బదులుగా మరొకరు ఉపాధి పనికి వెళుతున్నట్టు చెప్పారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని సంగారెడ్డిలో స్థిరపడ్డ పసుపులేటి నరసింహమూర్తి, పావని దంపతులకు బదులుగా ఆయన తల్లిదండ్రులు ఇక్కడ ప నికి వెళుతున్నట్టు చెప్పారన్నారు. ఒకరికి బదు లు మరొకరు పనికి వెళ్లొచ్చా.. అని అడిగిన ప్ర శ్నకు వెళ్లకూడదని ఏపీఓ బదులిచ్చారు. మరి ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.
ఆర్థిక సాయానికి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): షెడ్యూల్ కులాల అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్టు ఎస్సీ కా ర్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి ప్రకటనలో తలెఇపారు. అభ్యర్థులు సోమవారం నుంచి వచ్చేనెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లాకు ఎస్సీ కా ర్యాచరణ ప్రణాళిక కింద 1,111 యూనిట్లకు రూ.4644.05 లక్షల పథక విలువతో లక్ష్యాలను కేటాయించారన్నారు. సబ్సిడీగా రూ.1,835.30 లక్షలు, బ్యాంకు రుణాలుగా రూ.2,576.55 లక్షలు, లబ్ధిదారుల వాటాగా రూ.232.20 లక్షల నిర్దేశించారని పేర్కొన్నారు.
అలరించిన గానామృతం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం తూర్పుగో దావరి జిల్లా దొమ్మేరుకు చెందిన శ్రీ లక్ష్మీ నా రాయణ భజన సంఘం వారు నిర్వహించిన వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ గానామృతం అలరించింది. ముందుగా ఆలయ అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూ ర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజనలు చేస్తూ శ్రీవారి కల్యాణ గానామృతాన్ని నిర్వహించారు.


