సాక్షి, వరంగల్: అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రవేశ పెట్టింది. జిల్లాలో మొత్తం 8,93,213 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 7,30,072 (81.74 శాతం) మంది ఈకేవైసీ చేసుకోగా ఇంకా 1,63,141 (18.26శాతం)మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఽధ్రువీకరణ ద్వారా లబ్ధిదారుల వివరాలు నవీకరించబడి.. నకిలీ లేదా అనర్హ నమోదులను గుర్తించే అవకాశమున్న ఈ–కేవైసీ ప్రక్రియకు ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించడంతో ఇప్పటికై నా మిగిలిన లబ్ధిదారులు వేగిరంగా ఈ–కేవైసీ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరా విభాగాధికారులు కోరుతున్నారు. జూలై 31తో ముగియాల్సిన గడువును ఆగస్టు 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో భాగంగా ఈ నెలంతా రేషన్ దుకాణాలు తెరిచే ఉండనుండడంతో ఈ–కేవైసీ పూర్తిస్థాయిలో జరుగుతుందని అధికారులు భా విస్తున్నారు. గడువు పెరిగిందని నిర్లక్ష్యం చేయకుండా, బియ్యం కోసం వచ్చే మిగిలిన లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకొని ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే రేషన్ స్మార్ట్‌కార్డులు అందించే అవకాశం కనబడుతోంది.
జిల్లాలో ఈ–కేవైసీ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు
జిల్లాలో
ఈ–కేవైసీ
పరిస్థితి ఇలా..
పూర్తి
చేయాల్సిన వి
ఇంకా చేసుకోవాల్సిన వారు
1,63,141 మంది
ఈ నెల 31వ తేదీ వరకు గడువు
పెంచిన ప్రభుత్వం
ఆలస్యం చేయొద్దంటున్న అధికారులు
చివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం
గడువు ముగిసే వరకు వేచి చూడకుండా సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవాలి. చివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే ఈ–కేవైసీ పూర్తి చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. లేదంటే రేషన్ బియ్యం తీసుకొని వెళ్లేందుకు వచ్చే సమయంలో తమ కుటుంబసభ్యులను వెంట తెచ్చుకొని రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో రేషన్ పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండనుంది.
–కిష్టయ్య, జిల్లా పౌరసరఫరా విభాగాధికారి
మొత్తం రేషన్ కార్డులు
మొత్తం లబ్ధిదారులు
పూర్తైన
శాతం
ఈ–కేవైసీ పూర్తి
చేసిన వారు


