సాయం చేసి.. ధైర్యం నూరిపోసి | - | Sakshi
Sakshi News home page

సాయం చేసి.. ధైర్యం నూరిపోసి

Aug 2 2026 12:28 AM | Updated on Aug 2 2026 12:28 AM

సాయం చేసి.. ధైర్యం నూరిపోసి

కులమతాలకు అతీతం.. బాధకు దివ్యౌషధం. కళ్లు వర్షించలేని ఆనందభాష్పం.. కవులు వర్ణించలేని పదబంధం. నిత్య సుగంధాల పరిమళం.. అంతులేని సంపదల సాగరం.. చెలిమి, మైత్రి, ఫ్రెండ్‌, దోస్త్‌.. పేరేదైనా పిలిస్తే పలికేదే నేస్తం. నేనున్నాననే ధైర్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు, అంతకు మించి ఉంటారు. వారే ఆనందాలకు వారధులవుతారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అలాంటి వారెందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారిలో కొందరి గురించి ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ..

నల్లబెల్లి: నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 2005–06 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఏ చిన్న ఆపదొచ్చినా మేమున్నామంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. స్నేహితుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వివాహాలు చేసినా, ఏదైనా శుభకార్యాలు చేసినా, కుటుంబంలో ఏదైనా ఘటన జరిగినా అండగా నిలుస్తున్నారు. శుభ, అశుభ కార్యాల్లో ఆర్థిక చేయూతనందిస్తున్నారు. వీరి సేవల్లో అప్పటి గురువులు సైతం భాగస్వాములవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది స్నేహితులకు రూ.4,50,000 ఆర్థిక సాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement