‘సర్‌’.. మరోసారి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’.. మరోసారి

Aug 2 2026 12:40 AM | Updated on Aug 2 2026 12:40 AM

‘సర్‌’.. మరోసారి

ఉమ్మడి వరంగల్‌లో ఎస్‌ఐఆర్‌ పరిస్థితి ఇదీ..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

టర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో గడువు పొడిగింపు అధికారులు, సిబ్బందికి ఊరటనిచ్చింది. ఫారాల డిజిటైజేషన్‌ ప్రక్రియకు ఈ నెల10 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీస్‌ విడుదల చేసిన తాజా స్టేటస్‌ రిపోర్టు ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లో 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. వీరందరికీ ఎస్‌ఐఆర్‌ ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 26,68,980 ఫారాలు డిజిటైజ్‌ చేశారు. దీంతో డిజిటైజేషన్‌ 87.41 శాతానికి చేరింది.

జనగామ టాప్‌.. హనుమకొండ లాస్ట్‌

ఉమ్మడి వరంగల్‌లో ఎస్‌ఐఆర్‌ ఫారాల డిజిటైజేషన్‌లో జనగామ జిల్లా 91.49 శాతంతో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో 7,67,484 మంది ఓటర్లకు ఫా రాలు పంపిణీ చేయగా.. 7,02,192 ఫారాలు డిజి టైజ్‌ అయ్యాయి. మహబూబాబాద్‌ 90.09 శాతంతో రెండో స్థానంలో ఉంది. ములుగు 88.36, వరంగల్‌ 87.01, భూపాలపల్లి 86.81 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. హనుమకొండ 79.23 శాతంతో చివరి స్థానంలో కొనసాగుతోంది.

జిల్లాల వారీగా పరిస్థితి...

● హనుమకొండ జిల్లాలో 5,09,014 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. 4,03,271 ఫారాలు డిజిటైజ్‌ అయ్యాయి. డిజిటైజేషన్‌ 79.23 శాతం.

● వరంగల్‌ జిల్లాలో 7,76,953 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 6,76,026 ఫారాలు డిజిటైజ్‌ అయ్యాయి. డిజిటైజేషన్‌ 87.01 శాతం.

● జనగామ జిల్లాలో 7,67,484 మంది ఓటర్లకు ఫారాలు అందజేశారు. 7,02,192 ఫారాలను డిజిటైజ్‌ చేశారు. డిజిటైజేషన్‌ 91.49 శాతం.

● మహబూబాబాద్‌ జిల్లాలో 4,84,935 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. 4,36,864 ఫారాలు డిజిటైజ్‌ అయ్యాయి. డిజిటైజేషన్‌ 90.09 శాతం.

● జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2,77,882 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు.. 2,41,236 ఫారాలు డిజిటైజ్‌ చేశారు. డిజిటైజేషన్‌ 86.81 శాతం.

● ములుగు జిల్లాలో 2,36,970 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. 2,09,391 ఫారాలు డిజిటైజ్‌ అయ్యాయి. డిజిటైజేషన్‌ 88.36శాతం.

87.41 శాతం డిజిటైజేషన్‌..

జూలై 31 సాయంత్రం నాటికి ఉమ్మడి వరంగల్‌లో డిజిటైజేషన్‌ 87.35 శాతంగా ఉండగా.. శనివారం సాయంత్రానికి 87.41 శాతానికి చేరింది. అంటే ఒక్కరోజులో స్వల్పంగా పురోగతి నమోదైంది. గడువు ఈ నెల10 వరకు ఉండడంతో మిగిలిన ఫారాల డిజిటైజేషన్‌ను పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేయాల్సి ఉంది.

వరంగల్‌ హనుమకొండ జనగామ మహబూబాబాద్‌ భూపాలపల్లి ములుగు

మొత్తం ఓటర్లు పంపిణీ ఫారాలు డిజిటైజేషన్‌ ఫారాలు

ఇంకా పెండింగ్‌లో

3.84 లక్షల ఫారాలు...

30,53,238 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు 26.69 లక్షల మేర ఫారాల డిజిటైజేషన్‌ పూర్తయ్యింది. దీంతో మరో 3.84 లక్షలకుపైగా ఫారాలను డిజిటైజ్‌ చేయాల్సి ఉంది. హనుమకొండలోనే అత్యధికంగా 1,05,743 ఫారాలు డిజిటైజేషన్‌ కావాల్సి ఉండగా.. వరంగల్‌లో 1,00,927 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. జనగామలో 65,292, మహబూబాబాద్‌లో 48,071, జయశంకర్‌ భూపాలపల్లిలో 36,646, ములుగులో 27,579 ఫారాలు డిజిటైజేషన్‌ చేయాల్సి ఉంది.

గడువు ఈ నెల 10వ తేదీకి

పెంచడంతో ఊరట

30.53 లక్షల మంది ఓటర్లకు ఫారాల పంపిణీ

26.69 లక్షల ఫారాల డిజిటైజేషన్‌..

జనగామ 91.49, హనుమకొండ 79.23 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement