పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం

Aug 2 2026 12:34 AM | Updated on Aug 2 2026 12:34 AM

పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: రైతులు పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయాన్ని పొందాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పిలుపునిచ్చారు. మేరా రేషమ్‌ మేరా అభిమాన్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ నిర్వహించిన జిల్లాస్థాయి వాటాదారుల సంప్రదింపు సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు శాస్త్రవేత్తలు భువన, తిరుపతిరెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ అనసూయ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సెరికల్చర్‌) తిరుపతిరెడ్డి, సెరికల్చర్‌ అధికారి మల్లయ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

కాళోజీ సెంటర్‌: ఐసీడీఎస్‌ వరంగల్‌ ప్రాజెక్టు ఉర్సు సెక్టార్‌ 42 డివిజన్‌ పరిధిలోని మేరవాడ అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్‌వాడీ పరిసరాలు, ప్రీస్కూల్‌ కార్యక్రమాలు, బోధన విధానాన్ని గమనించి సలహాలు, సూచనలు చేశారు. అనంతరం బాలామృతం పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి, సీడీపీఓ విద్య, సూపర్‌వైజర్‌ బత్తిని రమాదేవి, అంగన్‌వాడీ టీచర్‌ వినీత తదితరులు ఉన్నారు.

శిశువుకు తల్లిపాలు శ్రేష్టమైనవి

పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో ఐసీడీఎస్‌ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు) జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement