పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం

Aug 2 2026 12:28 AM | Updated on Aug 2 2026 12:28 AM

పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం

న్యూశాయంపేట: రైతులు పట్టు పరిశ్రమను లాభదాయకమైన అనుబంధ వ్యవసాయ కార్యకలాపంగా చేపట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పిలుపునిచ్చారు. సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు ఆధ్వర్యంలో మేరా రేషమ్‌ మేరా అభిమాన్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ సమన్వయంతో నిర్వహించిన జిల్లా స్థాయి వాటాదారుల సంప్రదింపు సమావేశంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయిల్‌పామ్‌ తోటల్లో మల్బరీని అంతర పంటగా సాగు చేయాలన్నారు. పట్టు ఉత్పత్తులకు విలువ జోడింపు, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ అవకాశాలను మరింతగా వినియోగించుకోవడానికి టెక్స్‌టైల్‌ పార్క్‌ సౌకర్యాలు, జిల్లాలోని ఎగుమతి హబ్‌ను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు శాస్త్రవేత్తలు భువన, తిరుపతిరెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ అనసూయ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సెరికల్చర్‌) తిరుపతి రెడ్డి, సెరికల్చర్‌ అధికారి మల్లయ్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

శిశువుకు తల్లిపాలు శ్రేష్టమైనవి

కాళోజీ సెంటర్‌: తల్లిపాలు ప్రతీ శిశువుకు శ్రేష్టమైనవని, పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ హాలులో జిల్లా మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు) జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ త ల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీడబ్ల్యూఓ రాజమణి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, పోషణ్‌ అభియాన్‌ జిల్లా సమన్వయ బృందం సభ్యులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

కాళోజీ సెంటర్‌/ఖిలావరంగల్‌: ఐసీడీఎస్‌ వరంగల్‌ ప్రాజెక్టు ఉర్సు సెక్టార్‌ 42 డివి జన్‌ పరిధిలోని మేరవాడ అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్‌వాడీ ప రిసరాలు, ప్రీస్కూల్‌ కార్యక్రమాలు, బోధన విధానాన్ని గమనించి సలహాలు, సూచనలు చేశారు. అ నంతరం బాలామృతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ విద్య, సూపర్‌వైజర్‌ బత్తిని రమాదేవి, వినిత తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement