గీసుకొండ: రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ప్రతీ బూత్ కమిటీని పటిష్టం చేసుకుని ఎన్నికల కోసం సిద్ధం కావాలన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసి న మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, తప్పులను సవరించడానికి సర్ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి, రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ వన్నాల వెంకటరమణ, రత్నం సతీష్, గురుమూర్తి శివకుమార్‌లు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, కన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
కాళోజీ సెంటర్: తెలంగాణ రాష్ట్ర ఇటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత అడ్మిషన్ల గడువు జూలై 31వ తేదీతో ముగిసినప్పటికీ పలు కళాశాలల విద్యార్థుల అభ్యర్థన మేరకు అడ్మిషన్ల గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భూ సర్వేను
అడ్డుకున్న రైతులు
వర్ధన్నపేట: మండలంలోని దమ్మన్నపేట గ్రా మంలో శనివారం అధికారులు దేవాదుల లింక్ కెనాల్ భూ సర్వేను చేపట్టగా రైతులు తమకు తీ వ్ర నష్టం వాటిల్లుతుందని అడ్డుకున్నారు. దేవా దుల లింక్ కెనాల్ కాల్వను ప్రభుత్వ పాఠశాల వెనుక వైపు నుంచి తమ వ్యవసాయ భూముల నుంచి దమ్మన్నపేట చెరువు, కోనారెడ్డి చెరువులోకి వదలడంతో తమ పంట భూములు జలమయమవుతాయని రైతులు వాపోయారు. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ సుమ, తహసీల్దార్ విజయసాగర్, దేవాదుల ఎస్‌ఈ సర్వే వద్దకు వెళ్లి రైతులకు సముదాయించే ప్రయత్నం చేయగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు సర్వే నిలిపేసి వెనుదిరిగి వెళ్లి పోయారు. అనంతరం పలువురు రైతులు మా ట్లాడుతూ ఈ కాల్వ వెళ్లే పంట భూములు కేవలం సన్న చిన్నకారు రైతులవి మాత్రమే ఉన్నారన్నారు. కాల్వ నిర్మాణంతో ఎవరికీ ప్రయోజనం లేకపోగా మరింత నష్టం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణం చేయనివ్వమన్నారు. ఎమ్మెల్యే నాగరాజు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
అగ్నిమాపక సేవలు
అందుబాటులోకి తేవాలి
వరంగల్ అర్బన్: అగ్నిమాపక సేవలు ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆధునిక వెబ్‌సైట్‌ను రూపొందించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సైట్ రూపకల్పనపై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను కమిషనర్ పరిశీలించారు.


