అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయొద్దు

Jul 31 2026 1:27 AM | Updated on Jul 31 2026 1:27 AM

అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయొద్దు

బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: భద్రకాళి బండ్‌పై పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. గురువారం నగర పరిధి భద్రకాళి, వడ్డేపల్లి బండ్‌లను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి చేసిన పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం వడ్డేపల్లి బండ్‌పై కొనసాగుతున్న పనులు పరిశీలించారు. బండ్‌పై గ్రీనరీ ఏర్పాటుకు టెండర్‌ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని హార్టికల్చర్‌ అధికారిని ఆదేశించారు.

సమయపాలన పాటించాలి:

జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్‌

జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ ఈసంపల్లి జోనా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హెడ్‌ ఆఫీస్‌లోని వివిధ విభాగా లను సందర్శించి సిబ్బంది హాజరు నమోదులు, కార్యాలయ రికార్డులే పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులు కార్యాలయ సమయపాలన తప్పనిసరిగా పాటిచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement