కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గౌని సాంబయ్య బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.15వేలకు పైగా నగదు కాజేశారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.8,029 నగదు డ్రా అయ్యినట్లుగా గుర్తించిన సాంబయ్య వెంటనే బ్యాంకుకు వెళ్లి జరిగిన విషయం చెప్పి ఫోన్ నంబర్ మార్పించారు. ఫోన్ నంబర్ మార్చాను కదా ఏమీ కాదనే ధీమాతో ఉన్న సాంబయ్య ఖాతాకు ఓ మిత్రుడు రూ.7 వేలు పంపించాడు. రెండు నిమిషాల వ్యవధిలో ఆ నగదును సైతం సైబర్ మోసగాళ్లు పూర్తిగా అపహరించారు. కాగా, తాను ఒకరోజు ముందే రూ.2 లక్షలు డ్రా చేశానని, లేకపోతే అవి కూడా పోయేవని సాంబయ్య తెలిపారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


