రేషన్ బియ్యం రవాణాలో హమాలీలు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం వాస్తవమే. అధికారికంగా చెల్లించాల్సిన మొత్తాన్ని సంస్థ చెల్లిస్తున్నప్పటికీ, రేషన్ దుకాణాల వద్ద బియ్యం దింపేందుకు డీలర్లు ఇచ్చే చార్జీలు సరిపోవడం లేదని, రూ.10 ఇవ్వాలని హమాలీలు అనధికారికంగా కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి వారితో మాట్లాడుతున్నాం. రేషన్ షాపులకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి పంపే బియ్యాన్ని ఈ నెల నుంచి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా పక్కాగా తూకం వేసి పంపిస్తున్నాం. జూలై 28న అలాట్‌మెంట్ వచ్చినప్పటికీ వర్షాల కారణంగా ఒక రోజు ఆలస్యమైంది. ప్రస్తుతం అన్ని రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తాం. కొంత టైం పడుతుంది. బియ్యం పంపిణీ ప్రారంభ తేదీపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
– మహేందర్, డీఎం, పౌర సరఫరాల శాఖ
●


