మరో మూడు నెలలు! | - | Sakshi
Sakshi News home page

మరో మూడు నెలలు!

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

ఆగస్టులో ఒకేసారి మూడునెలల రేషన్‌ బియ్యం పంపిణీ

జిల్లాలో రేషన్‌ షాపులు, బియ్యం అలాట్‌మెంట్‌ వివరాలు

ఆగస్టులో ఒకేసారి మూడునెలల రేషన్‌ బియ్యం పంపిణీ

ఖిలా వరంగల్‌: వర్షాకాలం నేపధ్యంలో రేషన్‌ కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్‌ బియ్యాన్ని ముందస్తు పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఆగస్టు మాసంలో ఒకేసారి పంపిణీ చేయనున్నారు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

16,782.804 మెట్రిక్‌ టన్నుల

బియ్యం అవసరం

జిల్లాలో 509 షాపులు ఉన్నాయి. మొత్తం 2,93,824 రేషన్‌ కార్డులు ఉండగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆయా లబ్ధిదారులకు సన్న బియ్యం అందించేందుకు ప్రతీ నెల 5504.268 మెట్రిక్‌ టన్నులు మేర కేటాయిస్తున్నారు. జూలై నెలకు సంబంధించి నేటితో (సోమవారం) పంపిణీ గడువు ముగియనుంది. వచ్చే నెల ఆగస్టు 1 నుంచి ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలంటే మొత్తం 16,782.804 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం అవసరం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నూతన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నాయి. ఇటీవల జారీ అయిన నూతన కార్డులకు మరికొంత స్టాక్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

డీలర్లకు మరోసారి కష్టాలే!

ఆగస్టు మాసంలో మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రేషన్‌ డీలర్లకు మరోసారి కష్టాలు తప్పేలాలేవంటున్నారు. మూడు నెలల స్టాక్‌ దించుకునేందుకు షాపుల్లో స్థలం లేక గతంలో ఇబ్బందులు పడ్డారు. అమ్మికొద్ది బియ్యం తెచ్చుకోవడంతో అదనపు ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని డీలర్లు అంటున్నారు. హమాలీ చార్జీలు, ఇతర ఖర్చులతో మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మట్టిపాలవుతున్న దొడ్డుబియ్యం

జిల్లాలోని 509 రేషన్‌ షాపుల్లో సుమారు 16 నెలలుగా దొడ్డుబియ్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. అధికారులు వాటిని తరలించకపోవడంతో బియ్యానికి పురుగులు పట్టి వాసనొస్తున్నాయి. పైగా ఎలుకలు, పందికొక్కులు ఆ బియ్యాన్ని బుక్కేస్తూ మట్టిపాలు చేస్తున్నాయి. దొడ్డుబియ్యం నిల్వలు గోదాములకు తరలించిన తర్వాతే కొత్తగా కేటాయించిన సన్న బియ్యాన్ని రేషన్‌ షాపులకు తీసుకురావాలని డీలర్లు విన్నవిస్తున్నారు.

ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు

జిల్లాలో 16,782 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం

దొడ్డుబియ్యం నిల్వలకు పురుగులు

తరలింపు చర్యలు తీసుకోవాలని

డీలర్లు విజ్ఞప్తి

మండలం దుకాణాలు మొత్తం అలాట్‌మెంట్‌

కార్డులు (మెట్రిక్‌ టన్నుల్లో)

చెన్నారావుపేట 23 14,240 784.872

దుగ్గొండి 34 16,044 854.568

గీసుగొండ 35 19,902 1,073.778

ఖానాపురం 20 11,087 634.506

నల్లబెల్లి 30 12,882 742. 53

నర్సంపేట 40 24,794 1,377.168

నెక్కొండ 35 19,264 1,073.079

పర్వతగిరి 35 16,636 925.419

రాయపర్తి 37 18,675 1,087.923

సంగెం 31 16,562 901.8

వర్ధన్నపేట 32 16,649 935.013

వరంగల్‌ 85 54,613 3,332.163

ఖిలా వరంగల్‌ 72 52,476 3,059.985

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement