కాళోజీ సెంటర్: జిల్లాలోని పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ప్రతినిధి బృందం సభ్యులు కోరారు. ఆదివారం ఆర్జేడీ కార్యాలయంలో డీఈఓ రంగయ్యనాయుడును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత విద్యాపంవత్సరంలో జరిగిన అక్రమ సర్దుబాటులను రద్దు చేసి అదనంగా ఉన్న ఉపాధ్యాయులను మొదటిగా కాంప్లెక్స్ పరిధి, ఆ తర్వా త మండల పరిధిలో సర్దుబాటు చేయాలన్నారు. ఇంకా మిగిలిన పక్క మండలాలకు సర్దుబాటు చేయాలన్నారు. గతంలో అవసరం లేకుండా వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో సర్దుబాటు చేశారన్నారు. డీఈఓను కలిసిన వారిలో యూఎస్‌పీసీ భాగస్వామ్య సంఘాల బా ధ్యులు తాటికాయల కుమార్, ఊటుకూరి అశోక్, డి.మహేందర్ రెడ్డి, ఆకుల గోవిందరావు, సృజన్ ప్రసాద రావు తదితరలు ఉన్నారు.


