నర్సంపేట: మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి వనరుల లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల సాగు విధానాన్ని మార్చుకుని శాసీ్త్రయ పద్ధతులను అనుసరించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని రైతువేదికలో ఆదివారం ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ ఆరు మండలాల పరిధిలో రైతులు వర్షాభావ పరిస్థితుల దృశ్య ప్రభుత్వ నిర్దేశాల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పాకాల సరస్సు 3.26 టీఎంసీల నీరు సామర్ధ్యం కలిగినప్పటికీ ప్రస్తుతం 14 ఫీట్ల నీరు మాత్రమే ఉన్నాయని, ఆ నీటిని కూడా వినియోగిస్తే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉనికి చాటుకోవడం కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తూ పాకాల తూములు విప్పుతామని పోయినంత మాత్రన రైతులు వారిని నమ్మి వరి నాట్లు వేస్తే నీటి ఎద్దడితో తీవ్ర నష్టపోతారన్నారు.
ఆరుతడి పంటలు మేలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. ముఖ్యంగా నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుపై శాసీ్త్రయ సూచనలను పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి విజయ్‌భాస్కర్, జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ ఆనందం, ఇరిగేషన్ ఎస్‌ఈ, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి


