
గణపతి నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం చేయాలి
ఆత్మకూరు: గణపతి నిమజ్జన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వరంగల్ ఈస్ట్ జోస్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. మండలంలోని కటాక్షపూర్‌లో బుధవారం సాయంత్రం డీసీపీ అంకిత్‌కుమార్ పరకాల ఏసీపీ సతీశ్‌బాబుతో కలిసి చెరువు వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. గణపతి మండపాలను ఆన్‌లైన్ చేసుకునేలా నిర్వాహకులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోశ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.