ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

వనపర్తి రూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డా. సుదీరా ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్‌ ఓపీ, డెలివరీ, ఇన్‌పేషెంట్‌, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గర్భిణి వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డా. మంజుల, మండల వైద్యాధికారి డా. నదియా సదత్‌, ఆరోగ్య విస్తరణ అధికారి దామోదర్‌, డీడీఎం వెంకటకృష్ణ, హెల్త్‌ సూపర్‌వైజర్లు చంద్రయ్య, పార్వతి, స్వరూపారాణి, హెల్త్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌, ఫార్మసిస్ట్‌ కుమారి, స్టాఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ విక్టర్‌ రాజు, ఇతర వైద్యసిబ్బంది ఉన్నారు.

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి..

వీపనగండ్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలు, రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించడమేగాక మానసిక ధైర్యం కల్పించినప్పుడే ఆరోగ్యవంతులవుతారన్నారు. వివరాల ఆన్‌లైన్‌ నమోదు, విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, క్షయ, మలేరియా, డెంగీ గుర్తింపులో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ఆయన వెంట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ సూపరింటెండెంట్‌ డా. శ్రీనివాసులు, మెడికల్‌ ఆఫీసర్లు ప్రవళిక, నర్సింహారావు, పలువురు వైద్యసిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement