పంటలు బంద్‌! | - | Sakshi
Sakshi News home page

పంటలు బంద్‌!

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

న్యూస్‌రీల్‌

వనపర్తి
నీళ్లు నిల్‌..
ఉమ్మడి పాలమూరులో యాసంగిలో క్రాప్‌ హాలిడే

● అడుగంటిన జలాశయాలు..

ఆగిన సాగు

● ఖరీఫ్‌లో 8 లక్షల ఎకరాలకుగాను 6.50 లక్షల ఎకరాల్లోనే సాగు

● జూరాల చరిత్రలో తొలిసారిగా

నవంబర్‌లోనే నీటి ఎద్దడి

● ఐదు ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో

రెండో పంటకు నీళ్లివ్వలేని దుస్థితి

● వచ్చే వర్షాకాలం వరకు

తాగునీటి అవసరాలకే

ప్రాజెక్టుల నీరు

● ఆరుతడి పంటలే సాగు

చేయాలంటున్న అధికారులు

శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

ప్రియదర్శిని జూరాల జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం

గద్వాల: ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. ఫలితంగా అడుగంటిన జలాశయాలు! ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కింద ఈసారి ఖరీఫ్‌ సాగుకే నీటి కష్టాలు ఎదురుకాగా.. రబీ సీజన్‌లో రెండో పంటకు పూర్తిగా నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఖరీఫ్‌లో సుమారు 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. ఈసారి 6.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాగైన పంటలకూ సెప్టెంబర్‌, అక్టోబర్‌ నుంచే నీటి ఎద్దడి మొదలైంది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేసినా పూర్తిస్థాయిలో పంటలను కాపాడలేకపోయారు. ఇప్పుడు రబీ సీజన్‌లోనూ సాగుకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులు క్రాప్‌ హాలిడే ప్రకటించే దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జూరాల చరిత్రలోనే తొలిసారిగా నవంబర్‌లో నీటి నిల్వలు అడుగంటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement