నాణ్యత నగుబాటు! | - | Sakshi
Sakshi News home page

నాణ్యత నగుబాటు!

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

జిల్లాకేంద్రంలో విరిగిన కొత్త విద్యుత్‌ స్తంభాలు సంగంబండ, భూత్పూర్‌లో సగానికి పడిపోయిన నిల్వలు పోలీసులకు ఫిర్యాదు చేశాం..

నెట్టెంపాడులోనూ నీటి కొరత

జూరాలలో మునుపెన్నడూ లేని కష్టాలు

కోయిల్‌సాగర్‌లోనూ అంతంతమాత్రమే

తాగునీటికే ప్రాధాన్యం.. రబీలో క్రాప్‌ హాలిడే

జిల్లాకేంద్రంలో విరిగిన కొత్త విద్యుత్‌ స్తంభాలు

● ధ్వంసమైన ద్విచక్ర వాహనం..

త్రుటిలో తప్పిన ప్రమాదం

● విద్యుత్‌శాఖ పనితీరుపై సర్వత్రా విమర్శలు

హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఉన్నత పాఠశాలలో

శుక్రవారం రాత్రి ఎస్జీఎఫ్‌ అండర్‌–17

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభమైంది.

–8లో u

జాతీయస్థాయి సైక్లింగ్‌కు కేజీబీవీ విద్యార్థులు

ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ (ఇంగ్లీష్‌ మీడియం) విద్యాలయ విద్యార్థులు రష్మిత ఖేలోఇండియా జాతీయస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపికై నట్లు ఎస్‌ఓ లలిత, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఓ నాహిద్‌, పీఈటీ చిట్టి శుక్రవారం తెలిపారు. ఈ నెల 4న మక్తల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీల్లో 9వ తరగతి విద్యార్థి కీర్తి సబ్‌జూనియర్‌ విభాగంలో తృతీయస్థానం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని జి.రక్షిత జూనియర్‌ విభాగంలో ఐదోస్థానంలో నిలిచిందని చెప్పారు. వీరిరువురు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటిలో నిర్వహించే జాతీయస్థాయి సైక్లింగ్‌ పోటీల్లో రాష్ట్రం తరుఫున పాల్గొ ంటారని వివరించారు. ఎంపికై న విద్యార్థులను ఎస్‌ఓ, పీఈటీతో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

నేడు ఎంపీ

డీకే అరుణ రాక

అమరచింత: మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ శనివారం పట్టణానికి రానున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, కౌన్సిలర్‌ మేర్వ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అభయ ఫౌండేషన్‌ నిర్మించిన అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభిస్తారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలతో పాటు పార్టీ నాయకులు పాల్గొనాలని కోరారు.

అభ్యంతరాలుంటే

ఫిర్యాదు చేయండి : ఆర్డీఓ

అమరచింత: భూ రీ–సర్వేలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేసి పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు. మండలంలోని చింతరెడ్డిపల్లిలో శుక్రవారం జరిగిన భూ రీ–సర్వే ముగింపు గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామంలో 1,036 ఎకరాల పొలం ఉండగా.. కేవలం 17 మంది రైతులకు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని, వీరి పేరిట 27 ఎకరాల పొలం మాత్రమే ఉందని వివరించారు. మిగిలిన భూమి అంతా మంత్రాలయ క్షేత్ర శ్రీ గురు రాఘవేంద్రస్వామి పేరిట పట్టా ఉందన్నారు. నెలరోజులు రెవెన్యూ సిబ్బందితో పాటు సర్వే బృందం పక్కాగా భూ రీ–సర్వే నిర్వహించి పూర్తి చేసిందని, ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే తెలియపర్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రవికుమార్‌ యాదవ్‌తో పాటు సర్పంచ్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంగంబండ రిజర్వాయర్‌

సంగంబండ రిజర్వాయర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.50 టీఎంసీలే అందుబాటులో ఉంది. దీని కింద 65 వేల ఎకరాల ఆయకట్టుకు గాను ఖరీఫ్‌లో 50 వేల ఎకరాల్లో సాగు చేశారు. భూత్పూర్‌ జలాశయం సామర్థ్యం 1 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.50 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు కింద 45 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 30 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ రెండు జలాశయాల పరిధిలోనూ ఖరీఫ్‌ పంటలకు వారబందీ విధానంలోనే నీటిని విడుదల చేయాల్సి వచ్చింది.

108, 102 సేవలు

వినియోగించుకోవాలి

వనపర్తి రూరల్‌/వీపనగండ్ల: ప్రజలు 108, 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ రవికుమార్‌ సూచించారు. శుక్రవారం పెబ్బేరు, వీపనగండ్లలోని 108, 102 వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వాహనాల్లోని మందులు, ఆక్సిజన్‌, వైద్య పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆస్పత్రికి చేర్చేందుకు 108, గర్భిణులను ప్రసవ పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు, వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేర్చేందుకు 102 అమ్మఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అత్యవసర వైద్యసేవలు అందించడంలో సిబ్బంది బాధ్యత ఎంతో కీలమైందన్నారు. పెబ్బేరు పీహెచ్‌సీ వైద్యాధికారి డా. నదియా సాదర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అంబులెనన్స్‌ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించి వినియోగించుకునేలా చూడాలని కోరారు. ఆయన వెంట జిల్లా కో–ఆర్డినేటర్‌ దుర్గాప్రసాద్‌, టెక్నీషియన్లు మాసూమ్‌బాబా, రాము, పైలట్లు మొయినుద్దీన్‌, శివయ్య తదితరులు ఉన్నారు.

జిల్లాకేంద్రంలో లారీ ఢీకొనడంతోనే విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఒక స్తంభం విరిగిపడటంతో దానికి అనుసంధానంగా ఉన్న మరో రెండు స్తంభాలు సైతం కూలిపోయాయి. శాఖాపరంగా నిర్వహించిన తనిఖీలో స్తంభాల నాణ్యతలో ఎలాంటి లోపం లేదని తేలింది. ఇదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేవు.

– చిన్నం తాతారావు, ఎస్‌ఐ, విద్యుత్‌శాఖ

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్లుగా వినియోగంలో ఉన్న స్తంభాలు కాదు.. కేవలం రెండునెలల కిందటే ఏర్పాటు చేసిన స్తంభాలు అకస్మాత్తుగా నేలకొరిగాయి. వందలాది మంది రాకపోకలు సాగించే జనావాసాలు, ప్రధాన రహదారుల సమీపంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జిల్లాకేంద్రంలోని 6వ వార్డు పాత గాయత్రికాలనీలో శుక్రవారం ఉదయం 8.30 ప్రాంతంలో మూడు విద్యుత్‌ స్తంభాలు వరుసగా విరిగి సమీపంలో నిలిపిన ద్విచక్ర వాహనంపై పడటంతో ధ్వంసమైంది. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు ఉరుకులు పరుగులు తీయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జనావాసాల మధ్య కొత్త స్తంభాలు ఇలా కుప్పకూలడం విద్యుత్‌శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

అనేక సందేహాలు..

జిల్లాకేంద్రంలో రెండు నెలల కిందట విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మెరుగునకు సుమారు 50 కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. ఒక్కో స్తంభం ఏర్పాటునకు ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ.5 వేల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా కొద్ది వ్యవధిలోనే స్తంభాలు విరిగిపడటంతో నాణ్యత, ఏర్పాటు చేసిన విధానంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్తంభాలను నిర్ణీత లోతులో పాతారా లేదా? నాణ్యమైన సామగ్రిని వినియోగించారా? విద్యుత్‌ తీగలను నిబంధనల ప్రకారం బిగించారా? పనులు పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌ చేసిన పనుల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరి పాత స్తంభాల పరిస్థితి..

జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు సైతం శిథిలావస్థకు చేరాయి. తుప్పుపట్టి, బలహీనంగా మారిన స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం స్థానికులను వెంటాడుతోంది. కొత్తవి, పాతవి అనే తేడా లేకుండా ప్రమాదకరంగా ఉన్న అన్ని స్తంభాలను గుర్తించి తక్షణమే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. మరో ప్రమాదం జరగకముందే విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని.. పనుల నాణ్యతపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదంలో ధ్వంసమైన ద్విచక్ర వాహనానికి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 2 లక్షల ఎకరాలు కాగా, అసంపూర్తి పనుల కారణంగా ప్రస్తుతం 1.58 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం 1.32 టీఎంసీలు కాగా, ర్యాలంపాడు సామర్థ్యం 4 టీఎంసీలు. రిపేర్ల కారణంగా ర్యాలంపాడులో 2 టీఎంసీల నీటినే నిల్వ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద సాధారణంగా ఖరీఫ్‌లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రబీలో క్రాప్‌ హాలిడే అమలు చేస్తున్నారు. ఈసారి ఖరీఫ్‌లోనే నీటి కొరత ఏర్పడటంతో వారబందీ విధానంలో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ర్యాలంపాడులో 0.96 టీఎంసీలు, గుడ్డెందొడ్డిలో 0.36 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఈసారి అసాధారణ పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల కింద 1.10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాధారణంగా ఖరీఫ్‌లో ఈ ఆయకట్టు పరిధిలో వరి సాగవుతుండగా నవంబర్‌, డిసెంబర్‌ మొదటి వారంలో పంట చేతికొచ్చేది. ఈసారి లక్ష ఎకరాలకు పైగా వరి సాగు చేసిన రైతులకు సెప్టెంబర్‌, అక్టోబర్‌లోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి విడుదల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడంతోపాటు స్వయంగా కాలువలకు నీటిని విడుదల చేసుకున్న ఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేసులు సైతం నమోదయ్యాయి. ప్రభుత్వం కర్ణాటకతో చర్చలు జరిపినా ఆశించిన ఫలితం లేకపోయింది. చివరకు వారబందీ విధానంలో నవంబర్‌ 6 వరకు నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ చివరి ఆయకట్టు పరిధిలోని సుమారు 5 వేల ఎకరాల పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్‌లోనే జూరాలలో నీటి నిల్వలు అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది.

కోయిల్‌సాగర్‌ జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.15 టీఎంసీలే అందుబాటులో ఉంది. దీని కింద 50,250 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో కేవలం 12 వేల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉండటంతో సాగైన పంటలకు సైతం వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు.

వర్షాభావ పరిస్థితులతో జూరాల, భీమా, కేఎల్‌ఐ, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిధిలోని జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 9 టీఎంసీల నీటి నిల్వలను వచ్చే వర్షాకాలం వరకు తాగునీటి అవసరాల కోసం వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు పరిస్థితిని వివరిస్తున్నారు. రబీలో వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేయకుండా.. బావులు, బోర్లలో నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద రెండో పంటకు నీరందించలేని పరిస్థితి ఏర్పడటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement