ఏళ్ల తరబడి చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం మరమ్మతుకు నోచుకోక మరుగున పడింది. దీంతో ఎత్తిపోతలపై ఆధారపడిన రైతులు పంటలను పండించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా మరమ్మతు పనులను పూర్తిచేసి, ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలి.
– మల్లారెడ్డి, సర్పంచ్, కిష్టంపల్లి
చంద్రగఢ్, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరించేందుకు మంత్రి చొరవతో నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. పనులను దక్కించుకున్న గుత్తేదారుతో అగ్రిమెంట్ మాత్రం పూర్తి కాలేదు. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తిచేసి మరమ్మతు పను లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
– సమీ ఉల్లా, డీఈ, ఇరిగేషన్‌శాఖ


