మోసపూరిత పోస్టులను నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

మోసపూరిత పోస్టులను నమ్మొద్దు

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

వనపర్తి: తన పేరు, ఫొటోతో కూడిన నకిలీ వాట్సాప్‌ ఖాతాల ద్వారా డబ్బులు కోరుతున్న సందేశాలను ఎవరూ నమ్మొద్దని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తన పేరు, ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకుని 98130 15576 నంబర్‌తో ప్రజలకు సందేశాలు పంపిస్తూ.. డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి సందేశాలు పూర్తిగా నకిలీవని.. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్‌ పేర్లను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను మోసం చేయడం తీవ్రమైన నేరమని.. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సాప్‌ లేదా సోషల్‌ మీడియాలో ప్రభుత్వ అధికారుల ఫొటోలు, పేర్లు, హోదాలు కనిపించినంత మాత్రాన అవి నిజమైన ఖాతాలని నమ్మవద్దని కలెక్టర్‌ కోరారు.

ఫిర్యాదుల

పరిష్కారానికి చర్యలు

వనపర్తి: ప్రజల నుంచి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 11మంది తమ సమస్యలపై నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు అందించారు. వాటిని ఆమె పరిశీలించి.. ఆయా ఫిర్యాదులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు నష్టం

జరగకుండా చూడాలి

వనపర్తిటౌన్‌: పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ 3వ సెమిస్టర్‌ పరీక్ష ప్రశ్నపత్రంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ దేవర్ల కార్తీక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక పరీక్ష కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రంలోని సెక్షన్‌–బీలో 11వ ప్రశ్న రెండో సెమిస్టర్‌ సిలబస్‌కు సంబంధించి ఉండటంతో పాటు 11, 15వ ప్రశ్నల్లో మార్పులు చేయాల్సి ఉందని పరీక్ష సమయంలో విద్యార్థులకు తెలియజేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నెలల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులను చివరి నిమిషంలో గందరగోళానికి గురిచేయడం అధికారుల బాధ్యతారాహిత్యమని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వివాదాస్పద ప్రశ్నల కారణంగా విద్యార్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా చూడాలని ఆయన కోరారు.

మానసిక వికాసానికి క్రీడలు అవసరం

వనపర్తి రూరల్‌: విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఉమ్మడి జిల్లా ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. వనపర్తి మండలం చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గురుకులాల విద్యార్థులు క్రీడల్లో రాణించి, పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ శ్రీవేణి, ప్రిన్సిపాల్స్‌ రామకృష్ణ, గురువయ్యగౌడ్‌, అనిత, ఏపీటీలు కృష్ణకుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు ధనుంజయుడు, ఈశ్వర్‌, పీడీ నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement