వయోవృద్ధుల హక్కులపై విస్తృత అవగాహన | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధుల హక్కులపై విస్తృత అవగాహన

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

వనపర్తి: వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, చట్టపరమైన రక్షణ తదితర అంశాలపై ప్రజలకు విస్లృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్‌ 1న నిర్వహించనున్న వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా వయోవృద్ధుల సమాచార సంచికతో పాటు తల్లిదండ్రులు, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం–2007 ( Maintenance and Welfare of Parents and se nior CitizensAct, 2007)కు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. అదేవిధంగా వయోవృద్ధుల హక్కులు, సంక్షేమం, వారికి లభించే ప్రభుత్వ సేవలు, చట్టపరమైన రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటు చేయనున్న డిస్‌ప్లే బోర్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరియు చట్టపరమైన హక్కులు వినియోగించుకునేలా వయోవృద్ధులకు అవసరమైన సమాచారం అందించాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌, డీఆర్డీఓ రామమహేశ్వర్‌, జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) సుధారాణి, సీనియర్‌ సిటిజన్‌ కమిటీ సభ్యులు, సీడీపీఓలు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement