వనపర్తి: రైస్‌మిల్లర్లు తమకు సంబంధించిన బకాయిలను అక్టోబర్ 31లోగా పూర్తిగా చెల్లించాల్సిందేనని.. విఫలమైతే రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈటీఎఫ్ కె.రాంకుమార్, డీఎస్పీ వెంకటేష్, అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్, పౌరసరఫరాల మేనేజర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో 2022–23 రబీ సీజనన్‌కు సంబంధించి వేలం ద్వారా కేటాయించిన వరి (అ ఠఛ్టిజీౌ ుఽ్ఛఛీ ్క్చఛీఛీ డ) బకాయిలు, డిఫాల్ట్ పరిమాణాల క్లియరెనన్స్‌పై సంబంధిత డిఫాల్డ్ రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. 2022–23 రబీ సీజన్‌కు సంబంధించి వేలం ద్వారా కేటాయించబడిన వరి ధాన్యం బకాయిలు రూ.474 కోట్లు ఉండగా.. ఇప్పటి వరకు రూ.62.50 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, రూ.412 కోట్లు బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. వేలం ద్వారా కేటాయించబడిన వరికి సంబంధించిన బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. అదేవిధంగా, డిఫాల్ట్ పరిమాణాలకు సంబంధించిన బకాయిలను కూడా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా క్లియర్ చేయాలని కోరారు. ప్రభుత్వ బకాయిలు వసూలు చేసే నిమిత్తం అమలులో ఉన్న నిబంధనలు, నిర్దేశిత విధానాల ప్రకారం సంబంధిత డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ఆస్తులను వేలం వేసి రికవరీ చేస్తామని తెలిపారు. డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి అందే అభ్యర్థనలు, విన్నపాలను బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కమిషనర్, సివిల్ సప్లయిస్ పరిశీలిస్తారని వివరించారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి ఇచ్చిన గడువులోగా బకాయిలు చెల్లించి రెవెన్యూ రికవరీ చర్యలకు తావులేకుండా చూడాలని అధికారులు సూచించారు.


