ముగిసిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

బాలుర విభాగంలో మదనాపురం.. బాలికల విభాగంలో ఖిల్లాఘనపురం జట్లు విజయం

కొత్తకోట రూరల్‌: పెద్దమందడి మండలం మంగంపల్లిలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) జిల్లాస్థాయి అండర్‌–17 కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. జిల్లాలోని 15 మండలాలకు చెందిన బాలబాలికలు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. తుది పోరులో బాలుర విభాగంలో మదనాపురం ప్రథమ, కొత్తకోట ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో ఖిల్లాఘనపురం విజేతగా నిలవగా, పెబ్బేరు జట్టు రన్నరప్‌గా నిలిచింది. క్రీడాపోటీల నిర్వహణకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి (డీవైఎస్‌ఓ) సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో రాణించేలా ప్రోత్సహించడంలో ఎమ్మెల్యే సహకారం ఎంతో ఉపయోగపడిందన్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వ భావన పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్‌ ఇన్‌చార్జి కుమార్‌, సర్పంచ్‌ రమేష్‌ నాయక్‌, గ్రామ పెద్ద వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్‌, వనపర్తి మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ పరిణత, రాఘవేందర్‌, పీడీలు, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement